ఆంధ్రప్రదేశ్‌

ఆంధ్రాకు అన్నపూర్ణ పోలవరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 29: గోదావరి నదిపై పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అన్నది 70 ఏళ్ల నాటి కల. సాగునీరు, మంచినీరు, విద్యుత్ ఉత్పత్తి వంటి విస్తృత ప్రయోజనాలున్న ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా మారుతుంది. కేంద్రంలోని ఎన్డీఏ, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు పరుగులు తీయడం ప్రారంభించింది. మోదీ హామీ, బాబు కృషి, మంత్రి దేవినేని ఉమ, కేంద్ర మంత్రి ఉమాభారతి చిత్తశుద్ధి కలిసి ఈ నెల 30న పోలవరం కాంక్రీట్ పనుల బీజానికి కారణమయింది. ఆంధ్రప్రదేశ్‌కు అత్యంత ప్రయోజనకారి అయిన పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తెప్పించడంలోనూ, నాబార్డ్ ద్వారా నిధులు ఇచ్చేలా కేంద్రాన్ని ఒప్పించడంలోనూ సిఎం చంద్రబాబు చేసిన ఒత్తిళ్లు ఫలించాయి.
నిజానికి కేంద్రంతో పోరాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అన్ని అనుమతులు తెప్పించడంతోనే చంద్రబాబు సగం విజయం సాధించారు. ప్రతి సోమవారం పోలవరం వర్చువల్ విజిట్‌ను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ విజయంలో బిజెపి పాత్ర కూడా ఉందన్నది నిర్వివాదం.
విభజనచట్టం ద్వారా జాతీయ హోదా పొందిన దీనికి ప్రస్తుతం సుమారు రూ.2వేల కోట్ల రుణం నాబార్డు ద్వారా అందడంతో, సకాలంలో పోలవరం పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులు చేపడుతున్నారు. ఫలితంగా భవిష్యత్తులో 80 లక్షల హెక్టార్ల అదనపు ఆయకట్టుకు నీరు అందించేందుకు అవకాశం ఏర్పడనుంది. నదుల అనుసంధానం ద్వారా ప్రధాని ప్రశంసలు పొందిన బాబుకు, రాజకీయంగా-వ్యక్తిగతంగా పోలవరం ప్రాజెక్టు మరింత మైలేజీ తీసుకురానుంది. తమ ప్రభుత్వం నిధులివ్వడం వల్లే పోలవరం పూర్తవబోతుందని ప్రచారం చేసుకునే అవకాశం బిజెపికి దక్కనుంది.
నిజానికి వేల కోట్ల రూపాయల ఖర్చుతో కూడిన పోలవరం ప్రాజెక్టును ఒక్క రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టి పూర్తి చేయాలంటే సాధ్యమయ్యే పనికాదు. ఇలాంటి సందర్భంలోనే కేంద్రంతో దోస్తీ చేయడం ద్వారా రాష్ట్రానికి రావలసిన ఇతర ప్రయోజనాలు కొంత ఆలస్యమవుతున్నా, బాబు సహనంతో వేచి చూశారు. పోలవరం లాంటి ప్రాధాన్యతతో కూడిన ప్రాజెక్టు నిర్మాణం విషయంలో మాత్రం కేంద్రం ఉదాసీన వైఖరి వహించకుండా, ఎప్పటికప్పుడు వెంటపడుతూ అనుమతుల విషయంలోనూ, నిధుల విషయంలోనూ చంద్రబాబు, జలవనరుల శాఖ మంత్రి ఉమామహేశ్వరరావు, అధికార యంత్రాంగం చేసిన భగీరధ ప్రయత్నం, మోదీ, ఉమాభారతి సానుకూల స్పందన ఫలితమే కాంక్రీటు పనుల శ్రీకారానికి కారణమన్నది నిర్వివాదం.

పోలవరం
ప్రత్యేకతలు
గరిష్ట నీటిమట్టం :45.72 మీటర్లు (150.00 అడుగులు)
కనీస నీటిమట్టం : 41.15 మీటర్లు (135.00 అడుగులు)
గ్రాస్ స్టోరేజ్ ఆఫ్ రిజర్వాయర్ : 194.60 టిఎంసి
లైవ్ స్టోరేజ్ : 75.20 టిఎంసి
సబ్ మెర్జిన్స్ ఏరియా : 601 చ.కిమీ
చరిత్ర: * పోలవరం ప్రాజెక్ట్ ప్రతిపాదన 1941లో వచ్చింది.
* 1942 - 44 సంవత్సరాల్లో ప్రాథమిక దర్యాప్తు నిర్వహించారు.
* 208 అడుగుల గరిష్ట నీటిమట్టంతోపాటు, 836.35 టిఎంసిల నీటిని నిల్వ ఉంచొచ్చని అప్పట్లో నిర్థారించారు.
* పోలవరం నిర్మాణంలో ఎదురయ్యే అడ్డంకుల్ని అధ్యయనం చేసేందుకు డాక్టర్ జెఎల్ సాల్వేజ్ (రిటైర్డ్ చీఫ్ డిజైన్స్ ఇంజినీర్ ఆఫ్ యుఎస్ బిఆర్ డెన్వర్) నేతృత్వంలోని కొందరు ఇంజనీరింగ్ నిపుణులతో ఓ బోర్డును ఏర్పాటు చేశారు.
* పోలవరం ప్రాజెక్టుకు తొలుత రామపాద సాగర ప్రాజెక్ట్‌గా నామకరణం చేశారు.
* పోలవరం ప్రాజెక్టు గరిష్ట, కనీస నీటి మట్టం +150 అడుగుల వరకు ఉండొచ్చంటూ గోదావరి జల వివాద ట్రిబ్యునల్ ఆదేశాలిచ్చింది.
* 2004-05లో పోలవరం సాగునీటి ప్రాజెక్టు ప్రధాన డ్యాంతో పాటు కాలువ పనులు కూడా ప్రారంభమయ్యాయి.
* ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్ధీకరణ చట్టం 2014 ప్రకారం భారత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది.
* పోలవరం నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు 2015 జనవరి 9న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని ఏర్పాటు చేశారు.
* 2014 ఏప్రిల్ 1 నుంచి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తం నాబార్డు నిధులతో కేంద్రమే భరించనున్నట్లు ప్రకటించింది.
లాభాలు: * 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
* గోదావరి నుంచి కృష్ణానదికి 80 టిఎంసిల నీటి మళ్లింపు
* 2.91 లక్షల హెక్టార్లు (7.2 లక్షల హెక్టార్ల)కు సాగునీరు అందించవచ్చు.
* విశాఖ నగరవాసుల తాగునీటికోసం 23.44 టిఎంసిల కేటాయింపు
* 540 గ్రామాలు (28.5 లక్షల మంది ప్రజలకు) తాగునీటి సౌకర్యం
* చేపల పెంపకం, పడవలతో రవాణా మార్గానికి అవకాశాలు
* ఒడిషా, చత్తీస్‌గఢ్‌లకు 5 టిఎంసిలు, 1.5 టిఎంసిల నీటి సరఫరా
అనుమతులు: * పర్యావరణ అనుమతి (2005 అక్టోబర్)
* కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ నుంచి ఆర్ అండ్ ఆర్ అనుమతులు (2007 ఏప్రిల్ - మే)
* అటవీ శాఖ అనుమతి (స్టేజ్ 1: 2008 డిసెంబర్) (స్టేజ్ 2: 2010 జూలై)
* 2010 -11 అంచనాల ప్రకారం ప్రాజెక్టు నిర్మాణ ఖర్చు అంచనా రూ.16,010.45 కోట్లు
* కుడి కాలువ: 174 కిలోమీటరు పొడవైన ఈ కాలువ ద్వారా గుంటూరు, కృష్ణా జిల్లాలోని 3.2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తారు. ఇదే కాలువ ద్వారా గోదావరి నుంచి కృష్ణానదికి 80 టిఎంసిల నీరు మళ్లిస్తారు.
* ఎడమ కాలువ: 181.5 కిలోమీటర్ల పొడవున నిర్మించే ఎడమ కాలువ ద్వారా తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లోని నాలుగు లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తారు.