ఆంధ్రప్రదేశ్‌

ఇంధన పొదుపునకు జాతీయ అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 29: ఆంధ్ర థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల్లో ఉత్తమ టెక్నాలజీ విధానాలను అమలు చేసి నాణ్యమైన ఉత్పత్తిని చేసినందుకు ఏపి జెన్కో సిఎండి కె విజయానంద్‌కు, ఇంధన సంరక్షణ పద్ధతుల్లో అత్యుత్తమ విధానాలను అవలంభించినందుకు ఇంధన సంరక్షణ సంఘం సిఇవోఎ చంద్రశేఖర రెడ్డికి కేంద్రం అవార్డులను ప్రకటించింది. గురువారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో వీరికి కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి సంజీవ్‌కుమార్ బల్యాన్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్ ఒక ప్రకటన విడుదల చేస్తూ ఇంధన పొదుపులో ఆంధ్ర నమూనా దేశానికి ఆదర్శమన్నారు. ఈ అవార్డుల వల్ల ఏపివిద్యుత్ సంస్ధలకు జవాబుదారీతనం పెరుగుతుందని పేర్కొన్నారు.

చిత్రం..ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో చంద్రశేఖర్ రెడ్డికి అవార్డునిస్తున్న కేంద్ర మంత్రి ఎస్‌కె బల్యాన్