ఆంధ్రప్రదేశ్‌

సీమ జిల్లాల్లో నీటి ఎద్దడి నివారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, డిసెంబర్ 29: రాష్ట్రంలో రానున్న వేసవిలో తాగునీటి సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రూ.120 కోట్లు ఖర్చు చేయనున్నామని పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యు ఎస్, ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్ శాఖల మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. అనంతపురం నగరంలో గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ వచ్చే ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 13 జిల్లాల్లో తాగునీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి ప్రణాళిక రూపొందించామన్నారు. ఇందుకు రూ.120 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించామన్నారు. పైపులైన్ల లీకేజీలు, ట్యాంకులు, మోటార్ల, చేతిపంపుల మరమ్మతులు, చేతిపంపులు పని చేయని గ్రామాలకు ట్రాన్స్‌పోర్టేషన్ ద్వారా నీటిని రవాణా చేసేందుకు చర్యలు చేపట్టనున్నామన్నారు. గత ఏడాది 500 ట్యాంకర్లతో గ్రామీణ ప్రాంతాలకు నీటిని సరఫరా చేశామని, ఈ ఏడాది కూడా ప్రైవేటు ట్యాంకర్లు అద్దెకు తీసుకుని తాగునీరు సరఫరా చేస్తామని మంత్రి అన్నారు. 14వ ఫైనాన్స్ నిధులు కేంద్రం నుంచి వచ్చాయన్నారు.