ఆంధ్రప్రదేశ్‌

నేడు ప్రజాప్రతినిధులకు కాపు జెఎసి వినతిపత్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, డిసెంబర్ 29: కాపులను బిసిలుగా గుర్తించాలన్న డిమాండ్‌తో మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పిలుపు మేరకు రాష్ట్ర కాపు జెఎసి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు సమర్పించనున్నారు. 13 జిల్లాల్లో మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల ఇళ్ళకు కాపు జెఎసి నేతలు వెళ్ళి వినతిపత్రాలు అందజేస్తారని జెఎసి రాష్ట్ర నేత వాసిరెడ్డి ఏసుదాసు తెలియజేశారు. ముద్రగడ పిలుపు మేరకు ఈ దశల వారీ ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లా కేంద్రాల్లో ఆయా ప్రాంతాల జెఎసి నేతలు తమ ఆకలి కేకలను ప్రజాప్రతినిధులకు వినిపిస్తారన్నారు. జనవరి 9వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 7 గంటల మధ్య జిల్లాల్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. జనవరి 25వ తేదీన తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం నుండి ముద్రగడ సత్యాగ్రహ పాదయాత్ర ప్రారంభమవుతుందని తెలియజేశారు. అమలాపురం మీదుగా అంతర్వేది వరకు సాగే ఈ పాదయాత్రకు పెద్ద ఎత్తున కాపు సామాజికవర్గం హాజరుకానున్నట్టు దాసు చెప్పారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాపులను బిసిలుగా గుర్తిస్తామని హామీనిచ్చి చంద్రబాబు నేడు మోసం చేశారని ఆరోపించారు.