ఆంధ్రప్రదేశ్‌

ఇక వేగంగా భూసమీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 29: రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులు, పలు అభివృద్ధి పనుల కోసం శరవేగంగా భూమిని సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోర్టులు, రోడ్లు, జలమార్గాలు, బీచ్ కారిడార్, తదితర ప్రాజెక్టులకు నిర్ణయించిన ప్రకారం భూసమీకరణ జరపాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఆయా జిల్లాల్లో భూముల ధరలు, స్థానిక పరిస్థితుల ఆధారంగా భూసమీకరణ, లేక భూసేకరణ చేయనున్నారు. భూసమీకరణ ప్రక్రియ కోసం రెవెన్యూ, సర్వే సిబ్బందిని కేటాయించి, వారిని రిలీవ్ చేయాలని అందరు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. మచిలీపట్నం పోర్టుకు సంబంధించి భూసమీకరణ (ల్యాండ్ పూలింగ్)కు నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు.ఎ భూసమీకరణ పనులు వేగవంతం చేశారు. త్వరలోనే ఆయన భూమిని సమీకరించి ప్రభుత్వానికి అప్పగించే అవకాశం వుంది. రాజధాని అమరావతి నిర్మాణానికి భూసమీకరణకు అనుసరించిన పద్ధతులనే పోర్టు నిర్మాణానికి సమీకరించే భూముల విషయంలో కూడా అనుసరిస్తున్నారు. ఇందుకోసం పట్టా భూములు 14వేల ఎకరాలు, ప్రభుత్వ భూమి 5200 ఎకరాలను సమీకరించనున్నారు. పోర్టు నిర్మాణ పనులను 2017లో ప్రారంభించి 2018 నాటికి పూర్తిచేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. పోర్ట్ మాస్టర్ ప్లాన్ తయారీకి కనె్సల్టెంట్‌ని నియమించే ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలని ఇటీవల జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కాగా శ్రీకాకుళం జిల్లా భావనపాడు గ్రీన్‌ఫీల్డ్ పోర్టు కోసం 2050 ఎకరాల భూసేకరణను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంతబొమ్మాళి మండలం భావనపాడు, మర్రిపాడు, దేవునల్తాడ గ్రామాల పరిధిలో ఈ భూమిని సేకరిస్తారు. ఆ మేరకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌కు ప్రభుత్వం తగిన సూచనలు, సలహాలు కూడా ఇచ్చింది. ఈ పోర్టు నిర్మాణ టెండర్‌ని అంతర్జాతీయంగా పేరుపొందిన ప్రముఖ నౌకా నిర్మాణ సంస్థ అదానీ కంపెనీ దక్కించుకుంది. అందువల్ల భూసేకరణ జరిగిన వెంటనే పనులు ప్రారంభమయ్యే అవకాశం వుంది. అదేవిధంగా రాష్ట్రంలో అంతర్గత జలమార్గాన్ని అభివృద్ధి చేసి, జల రవాణాకు ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు తక్కువ ఖర్చుతో ఎక్కువ సామగ్రిని తరలించేందుకు జలరవాణా ఉపయోగపడుతుంది. కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు బకింగ్‌హామ్ కెనాల్‌ను పునరుద్ధరించి కాలువలు, నదులను అనుసంధానం చేసుకుంటూ ఈ జలమార్గానికి రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా ఇటు కృష్ణా, అటు గోదావరి నదుల మధ్య భూసేకరణకు సంబంధించి ఇప్పటికే సర్వే పూర్తిచేశారు. ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో అంతర్గత జలమార్గం కోసం భూమిని గుర్తించారు. భూమిని సేకరించే పనిని వేగవంతం చేశారు. ఇన్‌ల్యాండ్ వాటర్ వేస్ ప్రాజెక్టులో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో 74 కిలోమీటర్ల పొడవునా ఏలూరు కాలువను ఆధునీకరిస్తారు. నిడదవోలు-ఏలూరు మధ్య ప్రధాన కాలువను వెడల్పు చేసి ఓడల ద్వారా సరకుల రవాణా చేసేందుకు వీలుగా 35 గ్రామాలు, ఏలూరు, తాడేపల్లిగూడెంలలో భూసేకరణ చేపడుతున్నారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఖర్చయ్యే బీచ్ కారిడార్ ప్రాజెక్టుని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి విజయనగరం జిల్లా భోగాపురం వరకు బీచ్ కారిడార్‌గా అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూమిని తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో గుర్తించవలసి వుంది.