ఆంధ్రప్రదేశ్‌

ఐపిఎస్‌ల బదిలీలకు రంగం సిద్ధం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 4: రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నడుం బిగించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐపిఎస్ బదిలీలకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రమోషన్లు పొంది, అందుకు తగిన పోస్టింగ్‌ల కోసం ఎదురు చూస్తున్న ఐపిఎస్ అధికారులతో బాబు సోమవారం విజయవాడలోని సిఎం క్యాంపుఆఫీసులో భేటీ అయ్యారు. ఒక్కో పోలీస్ అధికారితో విడివిడిగా ఆయన సమావేశమయ్యారు. 2014లో పోలీస్ ఉన్నతాధికారులను బదిలీ చేసినప్పుడు కూడా ఇదే మాదిరి ఒక్కో ఐపిఎస్ అధికారితో ఆయన వ్యక్తిగతంగా మాట్లాడి, పోలీసింగ్‌పై ప్రభుత్వం విధానం ఏవిధంగా ఉండబోతోంది, పోలీస్ అధికారులు అం దుకు తగిన విధంగా అనుసరించాల్సిన విధానాల గురించి వివరించారు. మళ్లీ అదే విధానాన్ని కొనసాగించారు. రాష్ట్రంలోని ఎనిమిది మంది ఐపిఎస్ అధికారులతో ఆయన వ్యక్తిగతంగా సమావేశమయ్యారు.