ఆంధ్రప్రదేశ్‌

గండికోట నిర్వాసితుల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,డిసెంబర్ 29: కడప జిల్లాలోని గండికోట రిజర్వాయర్ నిర్వాసితులు గత నాలుగు రోజులుగా నిరాటంకంగా నిరసన తెలుపుతున్నారు. పరిహారం చెల్లించాలంటూ జాతీయ రహదారిపై ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. గండికోటకు కృష్ణాజలాలు తరలించడంతో జలాశయం నీటిమట్టం రోజురోజుకు పెరుగుతోంది. గురువారం 3.5 టిఎంసిల నీరు చేరింది. దీంతో ఇప్పటికే గండ్లూరు, చౌటపల్లె, బొమ్మెనపల్లె గ్రామాల్లోకి నీరు చేరింది. దీంతో గ్రామస్థులు తమకు పరిహారం ఇచ్చేందుకు వరకు గ్రామాలను విడిచిపెట్టమని ఆందోళనకు దిగారు. 5 టిఎంసిల నీరు గండికోటకు చేరితే ఆరు గ్రామాలు పూర్తిగా మునిగిపోతాయి. జర్వాయర్ ముంపుకింద 22 గ్రామాలు ఉడగా ప్రస్తుతం 14 గ్రామాలకు మాత్రమే పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 5 టిఎంసిల నీరు చేరితే 8 గ్రామాలు మునుగుతాయి. 8 టిఎంసిల నీరు చేరినట్లయితే 14 గ్రామాలు పూర్తిస్థాయిలో మునిగిపోనున్నాయి. ప్రస్తుతం చౌటపల్లె, గండ్లూరు, బొమ్మెనపల్లెల్లోకి నీరు చేరింది. రేపోమాపో కూనపల్లె, సీతాపురానికి నీరు చేరే అవకాశాలున్నాయి. ప్రభుత్వం పరిహారంగా చెల్లించేందుకు ఇప్పటికే రూ.479 కోట్లు విడుదల చేసింది. గ్రామాలు ఖాళీచేస్తే తమకు పూర్తిస్థాయిలో పరిహారం అందుతుందో లేదోనని నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. కలెక్టర్ కెవి సత్యనారాయణ, జనవరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ నిర్వాసితులకు గట్టి హామీ ఇచ్చినా వారు నమ్మడం లేదు.