ఆంధ్రప్రదేశ్‌

సారంగినిధులు మళ్లించకపోతే పులివెందులకు నీళ్లొచ్చేవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 29: గాలేరు - నగరి ప్రాజెక్టు ఫేజ్-1లో భాగమైన గండికోట జలాశయానికి రెండున్నరేళ్లలోనే ఇంతస్థాయిలో నీరు వస్తుందని జగన్ ఊహించి ఉండలేదని, గండికోట నీరు పులివెందుల భూముల్లో జనవరిలోనే పారబోతున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు చెప్పారు. నీరు చేరడాన్ని చూసి పులివెందుల నియోజకవర్గ ప్రజలతో పాటు జమ్మలమడుగు, కమలాపురం, తాడిపత్రి నియోజకవర్గాల్లోని రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోందన్నారు. చంద్రబాబు కష్టాన్ని జగన్ తన ఖాతాలో వేసుకునేందుకు తాపత్రయపడుతున్న తీరు కూడా హీనమైన చర్య అన్నారు. 80 శాతం ప్రాజెక్టు పనులు వైఎస్ పాలనలో పూర్తయ్యాయనే జగన్ వాదన పచ్చి అబద్ధమని, 80 శాతం నిధులు కాజేశారా? అని ప్రశ్నించారు. జలయజ్ఞం పేరుతో జరిగిన ధనయజ్ఞంలో 80 శాతం నిధులు కాజేయకుండా ప్రాజెక్టుపైనే ఖర్చుపెట్టి ఉంటే 2008 నాటికే పులివెందుల రైతులకు, కడప జిల్లా రైతులకు గాలేరు నగరి ద్వారా సాగు, తాగునీరు అంది ఉండేదన్నారు. వైఎస్ పాలనా కాలంలోనే 55వేల కోట్లు ఖర్చుపెట్టినా, ఆరేళ్లు పాలించినా ఎం దుకు కాల్వల్లో నీళ్లు పారలేదని అన్నారు. రెండున్నరేళ్ల కాలంలో ప్రాజెక్టులపై ఖర్చుపెట్టిన 19వేల కోట్లను సద్వినియోగపరిచి, పట్టిసీమలో నీరు పారించి గండికోటకు నీరిచ్చామని స్పష్టం చేశారు. జనవరి 2న కర్నూలు జిల్లాలో మచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ పంపులు ఆన్ చేయబోతున్నారు. తోటపల్లి ప్రాజెక్టు ప్రారంభించి నీళ్లిచ్చామని, పోలవరం 2018 నాటికి పూర్తిచేయబోతున్నారని వివరించారు. నాడు వారు ధనచౌర్యం చేయగా, నేడు చంద్రబాబు శ్రమను చౌర్యం చేయాలని చూస్తున్నారని వెంకట్రావు విమర్శించారు.