ఆంధ్రప్రదేశ్‌

ఇక కంటైనర్లు, బ్యాగుల ‘గుట్టు’రట్టు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 29: ఎగుమతుల్లో అక్రమాలకు పాల్పడే వారి బ్యాగులు ఇక గుట్టు రట్టు కానుంది. పోర్టులు, విమానాశ్రయాల నుంచి తరలివెళ్ళే కంటైనర్లు, లగేజ్ బ్యాగుల్లో అనధికారిక సామాగ్రిని పసిగట్టే అత్యాధునిక సాంకేతిక పరిఙ్ఞనంతో రూపొందించిన స్కానర్లను ఆంధ్రప్రదేశ్ కస్టమ్స్ శాఖ ప్రవేశపెట్టింది. త్వరలో కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల్లో అందుబాటులోకి రానున్నాయి. అవిధంగా త్వరలో ప్రారంభం కానున్న విజయవాడ ఫారిన్ పోస్ట్ఫాసుకు ఏపి రాజధానిలోని గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి రెండు స్కానర్లు ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటి వరకు కస్టమ్స్ అధికారులే తనిఖీలు చేస్తూ వస్తున్నారు. ఇక నుంచి ఈ స్కానర్లు లగేజ్ మాటను దాగిన గుట్టును పసిగట్టనున్నాయి. కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ‘ఎక్స్‌రే బ్యాగేజ్డ్ ఇన్‌స్పెక్షన్ సిస్టిమ్’ను గుంటూరు సమీపంలోని మర్రిపాలెం వద్ద ఉన్న ఇన్‌లాండ్ కంటైనర్ డిపో (ఐసిడి)లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. దీన్ని ఆంధ్రప్రదేశ్ కస్టమ్స్ కమిషనర్ ఎస్‌కె రహమాన్ గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఎగుమతుల్లో అక్రమాలు నిరోధించేందుకు ఈ స్కానర్లు దోహదపడతాయని ఈ సందర్భంగా కమిషనర్ వెల్లడించారు. విధి నిర్వహణలో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం ఈ స్కానర్లు ప్రవేశపెట్టిందని ఆయన చెప్పారు. విజయవాడ కస్టమ్స్ కమిషనరేట్ పరిధిలోని గుంటూరు ఐసిడి ద్వారా విదేశాలకు వివిధ రకాల ఉత్పత్తులు ఎగుమతి అవుతుంటాయి. విదేశాలకు ఎగుమతి చేసే ముందు కంటైనర్లలోని ప్యాకేజీ సరుకును ఇంతకుముందు కస్టమ్స్ అధికారులు స్వయంగా తనిఖీ చేసే పద్దతి ఉండేది. అయితే ఈ స్కానర్ల రాకతో ఇక నుంచి యంత్రాలే తనిఖీ చేస్తాయి. దీని వల్ల ప్యాకింగ్‌ల్లో అనధికార సరుకు ఏది ఉన్నా స్పష్టంగా తెలిసిపోతుంది. ఈ తనిఖీ యంత్రాల ద్వారా పరిశీలిస్తారు. దీంతో అక్రమాలు నిరోధించడంతోపాటు కస్టమ్స్ అధికారులకు ఉద్యోగ భద్రత, సమయం కూడా ఆదా అవుతుంది. ఇక కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల్లో ఇదే తరహా పనితీరుతో జనవరి 1 నుంచి మరో రెండు స్కానర్లు అధికారులు అందుబాటులోకి తీసుకురానున్నారు.
మర్రిపాలెంలో స్కానర్ శక్తిమంతం
కాగా గుంటూరు మర్రిపాలెంలోని ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపో (ఐసిడి)లో ప్రారంభించిన ‘ఎక్స్‌రే బ్యాగేజ్డ్ ఇన్‌స్పెక్షన్ సిస్టం’ స్కానర్ అత్యంత శక్తివంతమైంది. దీనికి రెండు వైపులా ముఖ ద్వారాలు, రెండు స్క్రీన్‌లు ఉన్నాయి. కోటి 5లక్షలు విలువైన ఈ హై క్వాలిటీ స్కానర్ మలేషియా నుంచి రప్పించారు. ఈ తరహా ఆధునిక స్కానర్లు దేశానికి ఏడు తీసుకురాగా, వీటిలో ఒకటి విజయవాడ కస్టమ్స్ పరిధిలోని గుంటూరు మర్రిపాలెంలో ఏర్పాటు చేశారు. ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల్లో తొలి అతి పెద్ద ఆధునిక స్కానర్ కూడా ఇదే కావడం విశేషం. మర్రిపాలెం ఐసిడిలో స్కానర్ ప్రారంభ కార్యక్రమంలో ఏపి కస్టమ్స్ కమిషనర్ రహమాన్‌తోపాటు అసిస్టెంట్ కమిషనర్ కె రాజశేఖరరెడ్డి, సూపరింటెండెంట్‌లు గుమ్మడి సీతారామయ్య చౌదరి, రమణారావు, ఇన్‌స్పెక్టర్లు అస్లాం, అశోక్ పాల్గొన్నారు.