ఆంధ్రప్రదేశ్‌

ప్రయాణికులకు నజరానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 30: మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో భర్తీకాని బెర్తులు, సీట్లను నింపేందుకు రైల్వేశాఖ గురువారం నుంచి తగ్గింపు ఆఫర్లను ప్రకటించింది. రైలులో రిజర్వేషన్ చేసుకున్న సమయంలో రిజర్వేషన్ చార్టు తుది ఖారారు అనంతరం ఖాళీగా మిగిలిపోయి వున్న సీట్లపై బేసిక్ చార్జీలో పది శాతం తగ్గింపు ఇస్తామని ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో ఏసి, స్లీపరు క్లాస్‌తో సహా అన్ని రిజర్వేషన్ సీట్లకు వర్తిస్తుందని పేర్కొన్నారు. పండుగ సీజన్‌లో ప్రయాణికులతో రద్దీగా వుండే సమయంలో కనీసం అత్యవసర సమయంలో రిజర్వేషన్ ఒకరోజు ముందు అదనపు చార్జీతో రిజర్వేషన్ చేసుకుని ప్రయాణించే ఈ రోజుల్లో రైల్వేశాఖ సంక్రాంతి బోనస్‌గా ప్రయాణికులకు బయట మార్కెట్‌లో బంపర్ ఆఫర్‌ల తరహాలో 10శాతం తగ్గింపుతో ఆఫర్లను ప్రకటించింది.
ఈ ఆఫర్ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ జనవరి 1వ తేదీ నుంచి ఆరునెలల పాటు అమలులో కొనసాగుతుంది. ఇందులో రాజధాని సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, దురంతో, శతాబ్ది సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో తత్కాల్ కోటాలో పదిశాతం సీట్లు తాత్కాలికంగా తగ్గించినట్లు వెల్లడించింది. రెండు వారాలకు ఒకసారి తాత్కాలిక కోటాపై జోనల్ రైల్వే చీఫ్ కమర్షియల్ మేనేజర్ (సిసిఎం) సమీక్షా సమావేశం జరుపుతారని ఒకవేళ తత్కాల్ టికెట్ల డిమాండ్ ఎక్కువగా వుంటే దాన్ని 30 శాతం వరకు పెంచడం జరుగుతుందని వివరించారు. న్యూఢిల్లీ నుంచి విడుదలైన ఈ ప్రకటనలో న్యూఢిల్లీ-అజ్మీర్ శతాబ్ది సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, మైసూర్-చెన్నై సెంట్రల్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లలో 140 రూపాయల వరకు తగ్గింపు ఇవ్వనున్నట్టు రైల్వేశాఖ ప్రకటించింది.