ఆంధ్రప్రదేశ్‌

రైలు ప్రమాద బాధితులకు నష్టపరిహారం పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 31: రైలు ప్రమాదంలో మరణించినవారికి రైల్వే యంత్రాంగం రెండింతలు నష్టపరిహారం చెల్లించడానికి అంగీకరించింది. ఈ విధానం నేటినుంచి అమల్లోకి వస్తుంది. దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థలో ఒకటైన రైల్వే వ్యవస్థలో భారతదేశంలో ఏదో ఒక మూల తరచూ ప్రమాదానికి గురవుతూ వందలాది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న సంగతి తెలిసిందే. ఇందుకు నిదర్శనం నవంబర్‌లో కాన్పూర్‌కు సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 140 మంది ప్రాణాలను కోల్పోగా 200 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఈ నేపధ్యంలో బాధిత కుటుంబాలకు నష్టపరిహారాన్ని రెట్టింపు చేయాలని రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటివరకు రైలు ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి అందే నష్టపరిహారం నాలుగు లక్షల నుంచి ఎనిమిది లక్షలుగా అందజేయనున్నారు. అలాగే ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చేయి, కాలు వంటి ఏదైనా అవయవ భాగాలను కోల్పోయిన ప్రయాణికునికి నష్టపరిహారం కింద నాలుగు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు అందజేయనున్నారు. అదే విధంగా ఇతర 34 రకాల్లో తగిలిన గాయాలకు నష్టపరిహారం కింద 64వేల నుంచి 7.2 లక్షల రూపాయలకు పెంచుతున్నట్లు రైల్వేశాఖ నిర్ణయించింది. రైల్వే ప్రమాదాలు, అవాంఛనీయ సంఘటనలు చట్టం 1990 నిబంధనలకు సవరణలు చేసి ఈ నష్టపరిహారాలను రైల్వేశాఖ పెంచింది. పెంచిన నష్టపరిహారాలు 2017 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. 1997లో నష్టపరిహారాలను నిర్ణయించిన రైల్వేశాఖ ఆనాటి నుంచి ఇప్పటివరకు ఈ చట్టంలో ఎటువంటి మార్పులు చేయలేదు. రైలు ప్రమాదాల్లో మరణించిన వారికి, గాయపడ్డ వారికి రైల్వేశాఖ ఇచ్చే నష్టపరిహారం పెంచాలని 2015లో ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. కాని స్పందించిన దాఖలాలు ఎక్కడా లేవు. ఇటీవల కార్పూర్ వద్ద జరిగిన ప్రమాదంతో రైల్వేశాఖ కొంతవరకు మేల్కొందని చెప్పవచ్చు. 1వ తేదీ నుంచి ఇన్స్యూరెన్స్ విధానాన్ని తప్పనిసరి చేసి నామినీ లేకపోయినా బీమాను అందించే విధంగా కల్పించారు. అలాగే కంటిచూపు, అంగవైకల్యం వంటివి ఏర్పడిన క్షతగాత్రులకు సైతం ఎనిమిది లక్షల వరకు నష్టపరిహారం చెల్లించనున్నట్లు నిర్ణయం తీసుకున్నారు.