ఆంధ్రప్రదేశ్‌

గంటాపై చర్యలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 31: బ్యాంకుల్లో తీసుకున్న రుణాల ఎగవేతకు పాల్పడిన మంత్రి గంటా శ్రీనివాసరావుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు డిమాండ్ చేశారు. విశాఖ సిపిఎం కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాలనలో పారదర్శకత, నిజాయితీ, సచ్ఛీలతపై పదేపదే మాట్లాడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మంత్రి వర్గ సహచరుల విషయంలో వౌనంగా ఉండటం దేనికి సంకేతమని ప్రశ్నించారు. మంత్రి గంటా ఆర్థికంగా ఉన్నతస్థాయికి చేరుకున్నది ప్రత్యూష కంపెనీ ద్వారానే అన్న విషయం అందరికీ తెలుసన్నారు. తనకు, ప్రత్యూష కంపెనీకి ఎటువంటి సంబంధం లేదంటూ మంత్రి గంటా బుకాయించినంత మాత్రాన తీసుకున్న రుణానికి తాను బాధ్యుడిని కానంటూ తప్పించుకునే అవకాశం లేదన్నారు. రూ.200 కోట్ల బ్యాంకు రుణం ఎగవేత అంశంలో మంత్రి గంటా పేరును వెల్లడించిన బ్యాంకు అధికారులను ఆయన అభినందించారు. ఇలాగే ఇంకెంతమంది బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఎగవేశారో వెల్లడించాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు విషయంలో కేంద్రం మొండిగా ముందుకు వెళ్లడాన్ని ఆయన తప్పుపట్టారు. రైతులకు ఇష్టం లేనప్పటికీ బలవంతపు భూసేకరణ చేస్తున్నారని, చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్న కలెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం వాస్తవాలు బయటపెట్టేందుకు పార్లమెంట్ సభ్యుల బృందాన్ని తీసుకురానున్నట్టు మధు వెల్లడించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో అక్రమంగా ఆక్వా చెరువుల తవ్వకాలకు పాల్పడుతున్న ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. తక్షణమే మత్స్యకారులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పన్నుల వసూళ్లు, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ వంటి పనులను ప్రైవేటీకరించేందుకు వీలుగా మెట్రో వౌలిక వసతుల అభివృద్ధి కమిటీ పేరిట రిజిస్ట్రేషన్ చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. దీనికి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు తక్షణమే ఉపసహరించుకోవాలన్నారు. కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో అభివృద్ధి మందగించిందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వ్వవసాయం, నిర్మాణ రంగం కుదేలైందని ఆందోళన వ్యక్తం చేశారు. టిడిపి పట్ల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత నెలకొందని, ఆపార్టీ ఇటీవల నిర్వహించిన రహస్య సర్వేలో తేలడంతో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించకుండా జాప్యం చేస్తోందని పేర్కొన్నారు.