ఆంధ్రప్రదేశ్‌

2016 కలిసొచ్చింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 31: రాష్ట్రానికి 2016 సంవత్సరం కలిసొచ్చిందని, అమరావతి ఒక శక్తి పీఠమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. అమరావతికి వచ్చాక అన్ని కలిసి వస్తున్నాయని, 2017 సంవత్సరం కూడా ఆదే విధంగా కలసి రావాలని ఆకాంక్షించారు. ఇకపై శాసన సభా సమావేశాల నిర్వహణకు హైదరాబాద్ వెళ్లే ప్రసక్తి లేదని, ఎపి భవన్ వద్ద మావోలు రెక్కి నిర్వహించడంపై మాట్లాడేందుకు నిరాకరించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన శనివారం మీడియాతో సిఎం మాట్లాడారు. కష్టమైనా, నష్టమైనా, ఎన్ని ఇబ్బందులు పడినా సొంత గడ్డపై నుంచే పాలన సాగించాలన్న దృఢ సంకల్పం 9 నెలల్లో కార్యరూపం దాల్చిందన్నారు. ఇక్కడి ప్రశాంత వాతావరణం కూడా పాజిటివ్ ఎనర్జీని ఇస్తున్నదన్నారు. దీంతో ఏది అనుకుంటే దానిని సాధించే దిశగా దూసుకుపోతున్నామన్నారు. ఈ స్థలానికి నమస్కారం చేస్తున్నానని, భూమిపూజ, వాస్తు, వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన మట్టి, నీళ్లతో ఈ ప్రాంతం పునీతమైందన్నారు. దీంతో ఇది శక్తివంతగా, శక్తిపీఠంగా మారిందంటూ అభివర్ణించారు. ఏ పని అనుకుంటే ఆ పని అవుతోందని, కలిసి వస్తోందన్నారు. తాను చాలా దూర దృష్టిలో ఆలోచించి, దానిని కార్యరూపం దాల్చేలా అన్ని చర్యలు తీసుకోవడం తనకు అలవాటని గుర్తు చేశారు. దీనికి టెక్నాలజీని జోడిస్తున్నానని తెలిపారు. 2016 అనేక విజయాలకు నాంది పలికిందని, అనేక అవార్డులు రాష్ట్రానికి లభించాయని గుర్తు చేశారు. ప్రజా సాధికార సర్వే చేసిన తీరు కారణంగా ఒక రాష్ట్రంలో సర్వే చేయాలని కోరారని, ఇక్కడ పని చేసిన తీరు వల్ల డబ్బు కూడా సంపాదించే అవకాశం కలిగిందన్నారు. 70 సంవత్సరాలుగా పట్టించుకోని పోలవరం ప్రాజెక్టు కార్యరూపం దాల్చిందన్నారు. 2200 కోట్ల రూపాయలు పోలవరానికి ఖర్చు చేశామని, సోమవారాన్ని పోలవారంగా మార్చి, సమీక్షించానని గుర్త చేశారు. గోదావరి పుష్కరాల్లో తాను, ప్రజలు చేసిన సంకల్పం ఫలితాన్ని ఇస్తున్నదన్నారు. రాష్ట్రంలోని నీటి వనరుల నిర్వహణకు వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తక్కువ వర్షపాతం నమోదైనా వ్యవసాయంలో ఎక్కువ వృద్ధి రేటు సాధించామన్నారు. పెండింగ్‌లో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పంటలను కాపాడేందుకు అవసరమైన చోట్ల మొబైల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఒక ఆలోచన అనేక మార్పులకు కారణమైందన్నారు. అమరావతి రాజధానికి భూసమీకరణ, ఫైబర్ గ్రిడ్, ఎల్‌ఇడి బల్బులు వంటివి ఇందుకు ఉదాహరణ గా తెలిపారు. కుల, మత ప్రాతిపదికన కొంతమంది రాజకీయ నిరుద్యోగులు ఉద్యమాల పేరుతో డబ్బులు సంపాదించుకునే యత్నం చేస్తున్నారన్నారు. ఉంచుకుని పేదరికం ఎక్కడ ఉంటే తాను అక్కడ ఉంటానని తెలిపారు. పేదరికమే తను కులమని, ఆదుకునేందుకు ప్రయత్నిస్తానన్నారు. దేశంలోనే అగ్రగామిగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతానన్నారు. త అన్ని దేశాల్లో తెలుగువారు ఉండేలా తాను ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీలోని ఎపి భవన్ వద్ద మావోలు రెక్కి నిర్వహించారన్న అంశంపై మాట్లాడేందుకు నిరాకరించారు. తాను ఎవరికీ చెడు చేయలేదని, అందరూ బాగుండాలని, శాంతిని కోరుకుంటానని తెలిపారు. శాసన సభా సమావేశాల కోసం హైదరాబాద్ వేళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.