ఆంధ్రప్రదేశ్‌

అమరావతిలో ట్రేడ్ సెంటర్ ఊసేది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఇంద్రకీలాద్రి), ఏప్రిల్ 4: నూతన రాజధాని అమరావతిలో రాష్ట్ర వ్యాపారవేత్తలకు ఉపయోగపడేలా ట్రేడ్ సెంటర్ ఏర్పాటు ప్రభుత్వంలో ఎలాంటి చలనం కనిపించటం లేదని వ్యాపార వర్గాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. అమరావతికి విదేశాల నుండి పారిశ్రామికవేత్తలు ఉప్పెనలా వచ్చి భారీ స్థాయిలో వ్యాపారాలు, పరిశ్రమలు పెట్టేందుకు ఉత్సాహం చూపుతున్నారని పదేపదే ప్రకటిస్తున్న మంత్రులు స్థానిక వ్యాపారుల ప్రయోజనాలపై దృష్టి సారించటం లేదని పలువురు అంటున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంవత్సరానికి మూడు పంటలు పండే సుమారు 33వేల ఎకరాల పంట పొలాలు అమరావతి నిర్మాణం కోసం సేకరించారు. అమరావతి భూమిపూజకు ముందు రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలను దృష్టిలో పెట్టుకొని ట్రేడ్ సెంటర్ ఏర్పాటుకు ప్రత్యేకంగా 500 ఎకరాల స్థలం కేటాయిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు తరువాత దాని ఊసే ఎత్తటం లేదని స్థానిక వ్యాపారులు విమర్శిస్తున్నారు. నూతన రాజధాని పేరు ప్రకటించిన తరువాత పరిశ్రమల స్థాపనకు వేల ఎకరాలు ఇవిగో అంటూ పదేపదే ప్రకటనలు చేసిన రాష్ట్ర మంత్రులు తర్వాత ఈ విషయాన్ని అటకెక్కించారు. అరచేతిలో సింగపూర్, జపాన్ వంటి దేశాల్లో ఉన్న పరిశ్రమలు, ట్రేడ్ సెంటర్లను చూపించిన మంత్రులు ఇప్పుడు వాటి ప్రస్థావనే మరిచారు. శరవేగంతో రాజధాని నిర్మాణం అంటూ తాత్కాలిక భవనాలు నిర్మించేందుకు రంగం సిద్ధమైన తరుణంలో కూడా ట్రేడ్ సెంటర్ ఏర్పాటుపై ఇప్పటివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక స్పష్టమైన ప్రకటన చేయకపోవటం ఎంతవరకు సమంజమని రాష్ట్రానికి చెందిన వ్యాపార వర్గాల వారు ప్రశ్నిస్తున్నారు. రాజధాని అమరావతిలో గతంలో ముఖ్యమంత్రి వాగ్దానం మేరకు వెంటనే ట్రేడ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి ఇందుకు అవసరమైన అన్నిరకాల వౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వాణిజ్య సెల్ రాష్ట్ర నాయకుడు కొణిజేటి రమేష్ ఉద్యమానికి రూపకల్పన చేస్తున్నట్లు తెలిసింది. అవకాశం దొరికినపుడల్లా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు సిద్ధంగా ఉన్న వైసిపికి ట్రేడ్ సెంటర్ అంశం చక్కటి ఆయుధంగా లభించింది. రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ రకాలైన వ్యాపారస్తులు పన్నుల రూపంలో సంవత్సరానికి 30వేల కోట్లు చెల్లించి ఖజానాకు సహాయం అందిస్తున్న నేపథ్యంలో అమరావతిలో ట్రేడ్ సెంటర్‌కు కనీసం 500 ఎకరాల స్థలం కేటాయించాలనే కోర్కె సమంజసం, న్యాయసమ్మతమైనదని స్థానిక వ్యాపారులు అంటున్నారు.