ఆంధ్రప్రదేశ్‌

ఆరోగ్యంలోనూ నెంబర్ 1

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 1: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో పాటు సంపూర్ణ ఆరోగ్యంగా కూడా ఉండాలనేది తన లక్ష్యంగా సిఎం చంద్రబాబు తెలిపారు. ఆయన తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్రంలోని దారిద్య్రరేఖకు ఎగువన ఉన్న 34లక్షల కుటుంబాల కోసం ఆరోగ్యరక్ష పథకాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. తొలి సంతకాన్ని ఆరోగ్యరక్ష పథకానికి సంబంధించిన ఫైల్‌పై చేశారు. అనంతరం ఆరోగ్యరక్ష పథకానికి సంబంధించిన దరఖాస్తుపై కూడా సంతకం చేశారు. తొలుతగా తన కుటుంబ సభ్యులందరినీ ఆన్‌లైన్‌లో తమ ఆధార్ నెంబర్‌తో రిజిస్టర్ చేసుకున్నారు. వెంటనే ఆరోగ్యశాఖ మంత్రి డా.కామినేని శ్రీనివాస్ చంద్రబాబు కుటుంబానికి హెల్త్‌కార్డు అందించి ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. ఇప్పటి వరకు తెల్లకార్డుదారులకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచిత వైద్యసహాయం లభిస్తుండగా ప్రభుత్వ ఉద్యోగులకు, జర్నలిస్టులకు నిర్ణీత రుసుంతో హెల్త్‌కార్డులు అందించారు. తాజాగా ఆరోగ్యరక్ష పథకం ద్వారా పింక్‌కార్డు దారులందరికీ కూడా హెల్త్‌కార్డు జారీ కానున్నాయి. మొత్తం పై రాష్ట్రంలో అన్ని కుటుంబాలకు హెల్త్‌కార్డుల సౌకర్యం అందుబాటులోకి వచ్చినట్లయింది. ఈ పథకంలో చేరాలనుకునే వారు జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు మీసేవా కేంద్రాల్లో ఆధార్ నెంబర్‌తో రిజిస్టర్ చేసుకోవచ్చు.
ఆరోగ్యరక్ష హెల్త్‌కార్డుకు నెలకు ఒకరికి రూ.100, సంవత్సరానికి వ్యక్తికి రూ.1200 ఆన్‌లైన్‌లో చెల్లిస్తే వారికి ఒకరికి రూ.2లక్షల వరకు వైద్య సదుపాయం లభిస్తుంది. కుటుంబంలో నలుగురు ఉంటే సంవత్సరానికి రూ.4800 చెల్లిస్తే రూ.8 లక్షల వైద్య సదుపాయం లభిస్తుంది. దేశంలోనే ప్రజల ఆరోగ్యం కోసం ఆరోగ్యరక్ష పథకాన్ని ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. 2016సంవత్సరం రాష్ట్రంలో పాలనలో సుస్థిరత తీసుకువచ్చామని, 2017వ సంవత్సరం అలాగే అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. అందరూ ఎకానమి, పేదరికం గురించి మాట్లాడుతున్నారని, కాని ముఖ్యమైన ఆరోగ్యం గురించి ఆనందం గురించి మాట్లాడటం లేదని తెలిపారు. ఆనందం, ఆరోగ్యం ఉన్న దేశాల్లో లైఫ్‌స్పాన్ ఎక్కువగా ఉంటుందని, నేడు వైద్యరంగంలో కూడా సాంకేతికంగా అనేక విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇటీవల ఏడుకొండలరావు అనే వ్యక్తికి బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి గుండెను అమర్చి ఒక కొత్త నూతన ఒరవడికి ప్రభుత్వ వైద్యులు శ్రీనివాస్ శ్రీకారం చుట్టారన్నారు. ప్రతి వ్యక్తి ఆరోగ్యంపై శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని, ఆరోగ్యంగా ఉంటేనే ఆనందంగా ఉంటామని, మనిషి ఆరోగ్యం పరిసరాలపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. మనం తీసుకునే ఆహారంలో అన్ని పోషక విలువలతో కూడిన పదార్థాలు బ్యాలెన్స్‌గా తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. ప్రతి వ్యక్తికి చదువు, విజ్ఞానం, ఆరోగ్యం ముఖ్యమని, విజ్ఞానం ఉండి ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించవచ్చని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా 5400 సర్జికల్ పరికరాలు, సంచార వైద్యసేవలు అన్ని కూడా ఆన్‌లైన్‌లో పెట్టామని తెలిపారు. రాష్ట్రంలో 436 ఆసుపత్రుల్లో ఆరోగ్య రక్ష కింద వైద్యం చేయించుకోవచ్చని, ఇందులో 80 ప్రభుత్వ ఆసుపత్రులని, ఈ ఆసుపత్రుల్లో నచ్చిన డాక్టర్‌తో పాటు ఆరోగ్యంపై కూడా ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టి అప్పుల పాలు అవుతున్నారన్నారు. వాటి నుంచి విముక్తి పొందడానికే ఈ ఆరోగ్య రక్ష పథకానికి రూపకల్పన చేసినట్లు తెలిపారు. నిరుడు 54శాతం వరకు ఆరోగ్యంపై ప్రజలు ఖర్చు పెట్టారని, నేడు ఆది 17 శాతానికి తగ్గిందని, అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేసుకునే వారి సంఖ్య పెరగడమే దీనికి కారణమన్నారు. ఆరోగ్యంపై ఎంత తక్కువ ఖర్చు చేస్తే అంత బెస్ట్‌స్టేట్‌గా ఏపి అభివృద్ధి చెందుతుందన్నారు. ఆరోగ్యరక్ష కింద అందరికీ భద్రత ఇవ్వాలని కోరుకుంటున్నామని, వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో 1.55కోట్ల లక్షల వైద్య పరీక్షలను జరిపామని, లక్షల మంది బాలింతలను తల్లిబిడ్డల ఎక్స్‌ప్రెస్ ద్వారా వారి ఇళ్లకు చేర్చామన్నారు. రాష్ట్రంలో ఒపి 28శాతం పెరిగిందని అన్నారు. 272 అర్బన్ హెల్త్‌సెంటర్స్ ప్రారంభిస్తున్నామన్నారు. వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య మాట్లాడుతూ కొత్త సంవత్సరం మొదటి రోజే వైద్య, ఆరోగ్యశాఖ పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించడం మాపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. ఆరోగ్యరక్షలో చేరాలనుకునే వారు ఆధార్ నెంబర్‌తో రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

చిత్రం..కుటుంబ సభ్యుల ఆరోగ్య రక్ష కార్డు అందుకుంటున్న చంద్రబాబు