ఆంధ్రప్రదేశ్‌

పాఠశాలల్లో కృతజ్ఞతా ప్రతిజ్ఞ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 1: రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులచే కృతజ్ఞతా ప్రతిజ్ఞ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. విశాఖలో ఆయన ఆదివారం విలేఖరులతో మాట్లాడారు. ప్రస్తుతం విద్యా సంస్థల్లో విద్యార్థులు చేస్తున్న ప్రతిజ్ఞతో పాటు కృతజ్ఞతా ప్రతిజ్ఞ ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరిలోనూ కృతజ్ఞతా భావాన్ని పెంపొందించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. మానవునిగా పుట్టిన ప్రతి ఒక్కరూ భగవంతుడు, ప్రకృతి, సమాజం, ప్రభుత్వం, ఇరుగుపొరుగువారి నుంచి ఎన్నో విధాలుగా లబ్ధిపొందుతున్నారని పేర్కొన్నారు. వారు తాము పొందుతున్న ప్రేమ, ఆప్యాయతలకు కృతజ్ఞతలు తెలుపుకోవాలనే భావాన్ని పెంచేలా చూడాలని అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టును పూర్తిచేసి పంటలకు నీరందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల దృష్టిలో దైవంగా నిలిచారన్నారు. అందుకే వారంతా కృతజ్ఞతగా తమ మొదటి పంటను చంద్రబాబుకు కానుగా ఇచ్చారని తెలిపారు.