ఆంధ్రప్రదేశ్‌

167 మంది మావోల లొంగుబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీలేరు, ఏప్రిల్ 4: సుమారు 167 మంది మావోయిస్టు సానుభూతిపరులు, మిలీషియా సభ్యులు ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా ఎస్పీ మిత్రభాను మహాపాత్రో ఎదుట సోమవారం లొంగిపోయారు. మల్కన్‌గిరి జిల్లా మత్తిలి పంచాయతీ పరిధి తోకరాయి గ్రామానికి చెందిన 8 మంది మిలీషియా, ఐదుగురు మావోయిస్టు గ్రామ కమిటీ సభ్యులు, జననాట్యమండలి సభ్యులతో పాటు 167 మంది సానుభూతిపరులు మావోయిస్టు దర్బా డివిజన్ కమిటీలో కొన్నాళ్ళుగా పనిచేస్తున్నారు. జిల్లాలో మావోయిస్టులపై పోలీసుల దాడులు పెరిగిపోవడంతో గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదని, ఈనేపధ్యంలో మావోయిస్టు మిలీషియా, సానుభూతిపరులు సమావేశామై స్వచ్చందంగా లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఎస్పీ మిత్రభాను మహాపాత్రో ఎదుట సోమవారం లొంగిపోయారు. వీరికి పునరాసం కల్పించి, ఎటువంటి కేసులు లేకుండా విడిచిపెడతామని ఎస్పీ మిత్రభాను మహాపాత్రో తెలిపారు.

చిత్రం మల్కాన్‌గిరి ఎస్పీ ఎదుట లొంగిపోయిన నక్సల్స్