ఆంధ్రప్రదేశ్‌

దిల్‌సుఖ్‌నగర్ దోషుల అప్పీళ్ల స్వీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 2: దిల్‌సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్ల కేసులో అప్పీళ్లను హైకోర్టు స్వీకరించింది. మూడున్నరేళ్ల క్రితం జరిగిన దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో దోషులో తేలిన అసదుల్లా అక్తర్, యాసిన్ భత్కల్, తహసిన్ అక్తర్, జియాహుల్ రెహ్మన్, యజాజ్ షేక్‌లకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ ఎన్‌ఐఎ న్యాయస్థానం తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో వచ్చిన అప్పీళ్లను హైకోర్టు విచారణకు స్వీకరించింది. అప్పీళ్లు, రీ ట్రయల్ కలిపి తుది విచారణ జరపాలని నిర్ణయం తీసుకుంది.
విత్తన కంపెనీల రద్దు సరికాదు
విత్తన కంపెనీల రద్దు విషయంలో అధికారులు నియమ నిబంధనలను పాటించాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ రామలింగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు.
క్వారీ తవ్వకాలు ఆపండి
తూర్పుగోదావరి జిల్లా లోవ గ్రామంలో క్వారీ తవ్వకాలు జరగకుండా నిలువరిస్తూ హైకోర్టు గనుల శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ నవీనరావు ఉత్తర్వులు ఇచ్చారు.