ఆంధ్రప్రదేశ్‌

సిఎం సభలో అపశృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జనవరి 2: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్న జన్మభూమి-మా ఊరు తొలిసభలో అపశృతి చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి భద్రత కోసం వచ్చిన స్పెషల్ బ్రాంచి కానిస్టేబుల్ అంపయ్య (25) చేతిలోని తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో మరణించాడు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంకు చెందిన హంపన్న విడపనకల్లు పోలీసుస్టేషన్‌లో స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం తడకనపల్లెలో సోమవారం నిర్వహించిన జన్మభూమి-మా ఊరు గ్రామసభకు ముఖ్యమంత్రి రావడంతో హంపయ్యను విధులకు పంపారు. దీంతో హంపయ్య గుండెకు ఎడమ వైపు తూటా దూసుకుపోయింది. వైద్యులు అత్యవసర విభాగంలో చికిత్స నిర్వహిస్తున్న సమయంలో హంపన్న మరణించాడు. హంపన్న మృతితో పోలీసు అధికారులు, సిబ్బంది తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కర్నూలు రేంజి డిఐజి రమణరావు, కలెక్టర్ విజయమోహన్, ఎస్పీ ఆకె రవికృష్ణ ఆసుపత్రికి వెళ్లి కానిస్టేబుల్ మరణంపై విచారణ నిర్వహించారు.