ఆంధ్రప్రదేశ్‌

మీరందరూ సహకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తపేట, జనవరి 2: ఏ వర్గానికీ నష్టం కలగకుండా కాపులను బిసిల్లో చేర్చడానికి అందరూ సహకరించాలని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం బిసి ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. కాపులను బిసిల్లో చేర్చడానికి సహకరించాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యంను సోమవారం ఆయన ఇంటి వద్ద కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. అధికార టిడిపికి చెందిన బిసి నేత సుబ్రహ్మణ్యంను కలిసిన ముద్రగడ సుమారు గంటకుపైగా రిజర్వేషన్ సమస్యపై చర్చించారు. కాపులను బిసిల్లో చేర్చటం వల్ల బిసిలకు జరిగే అన్యాయంపై ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం వివరించగా, అసలు బిసిలకు అన్యాయం జరగకుండా రిజర్వేషన్ ఏ విధంగా ఇవ్వాలనే దానిపైన ముద్రగడ చర్చించారు. కాపులను బిసిల్లో చేర్చటం వల్ల రాజకీయ రిజర్వేషన్‌ల్లో అన్యాయం జరుగుతుందని, విద్యా, ఉద్యోగపరంగా ఎటువంటి నష్టం కలగదని సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. కాపులు సామాజిక పరంగా వెనకబడలేదని, ఆర్థిక వెనుకబాటు ఉందని అంగీకరించారు. రాజకీయంగా కూడా వర్గీకరణ ద్వారా టిక్కెట్ల కేటాయింపు చేయాల్సిన అవసరం ఉందని సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. దీనిపై ముద్రగడ పద్మనాభం స్పందిస్తూ తాము కోరే రిజర్వేషన్ ఇప్పటిది కాదని బ్రిటీష్ కాలం నుంచి ఉన్న రిజర్వేషన్‌ను తిరిగి ఇవ్వాలని మాత్రమే కోరుతున్నామని పేర్కొన్నారు. ముఖ్యంగా బిసిలకు ఎటువంటి అన్యాయం జరగకుండా ప్రత్యేకంగా రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. బిసిలకు రిజర్వేషన్ పెంచాలని ఉద్యమంచేస్తే తాను వారికి మద్దతుగా పోరాడేందుకైనా సిద్ధమన్నారు. పక్క రాష్ట్రాల తరహాలో రిజర్వేషన్ శాతాన్ని పెంచైనా ఇవ్వవచ్చునని గుర్తుచేశారు. ఎవరికి అన్యాయం జరగకుండా ఇరుపక్షాల వారితో ముఖ్యమంత్రి సమావేశాన్ని ఏర్పాటుజేసి ఒప్పించాలని ముద్రగడ తెలిపారు. ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణు, కల్వకొలను తాతాజీ, మిండుగుదిటి మోహన్, ముత్యాల వీరభద్రరావు, బండారు సత్తిరాజు పాల్గొన్నారు.

చిత్రం..ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యంకు వినతిపత్రం సమర్పిస్తున్న ముద్రగడ