ఆంధ్రప్రదేశ్‌

తూ.గో.లో పర్యాటక ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జనవరి 3: పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలోని మూడు ప్రాంతాల్లో రాష్టస్థ్రాయి పర్యాటక ఉత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా కేంద్రం కాకినాడలో మంగళవారం ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సమక్షంలో అధికారులు ఆయా ఉత్సవాల తేదీలను ఖరారుచేశారు. కాకినాడ బీచ్ ఫెస్టివల్ (ఎన్టీఆర్ బీచ్ ఫెస్టివల్)ను ఈనెల 12, 13, 14, 15 తేదీల్లో నిర్వహించనున్నట్టు ప్రకటించారు. కోనసీమ ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఫిబ్రవరి 23, 24, 25, 26 తేదీల్లో కోనసీమ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నారు. జిల్లాలోని ఏజన్సీ ప్రాంత అందాలను బయటి ప్రపంచానికి చాటిచెప్పడానికి ఈ ఏడాది మార్చి 26, 27, 28 తేదీల్లో మన్యం ఫెస్టివల్‌ను నిర్వహించనున్నారు. పర్యాటకపరంగా జిల్లాను అభివృద్ధి చేయడానికి, ఇక్కడి సంస్కృతీ, సంప్రదాయాలను దశదిశలా చాటడానికి పర్యాటక ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఇకపై ఏటా ఇవే తేదీలలో ఉత్సవాలు నిర్వహించనున్నారు. జిల్లాలోని పర్యాటక అందాలకు దేశ వ్యాప్త గుర్తింపు తెచ్చే రీతిలో ఉత్సవాలను నిర్వహించాలని భావిస్తున్నారు. కాకినాడ బీచ్‌కు నీటిపైన, భూమిపై కూడా పర్యటించే ప్రత్యేక వాహనాన్ని సమకూర్చనున్నారు. బీచ్ ఫెస్టివల్ సంక్రాంతి సమయంలో జరుగుతున్నందున విధులు నిర్వహించే ప్రభుత్వ సిబ్బందికి పండుగ తర్వాత సెలవులు మంజూరుచేయాలని అధికారులు నిర్ణయించారు. బీచ్ ఫెస్టివల్‌లో ఆక్వా రంగానికి, పండ్ల తోటల విభాగానికి ప్రాధాన్యతనివ్వడంతో పాటు వాటర్ స్పోర్ట్స్ నిర్వహిస్తారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేయనున్నారు. రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన ఆలయ నమూనాలను ఏర్పాటుచేయనున్నారు. మెగా ఫుడ్ ఫెస్టివల్, టెక్స్‌టైల్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు. అలాగే కోరంగి అభయారణ్యాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప చెప్పారు.