ఆంధ్రప్రదేశ్‌

కోడి పందాలకు అనుమతి కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,జనవరి 3: ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందాల నిర్వహణపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కోడి పందేల నిర్వహణపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని సుప్రీంకోర్టులో పారిశ్రామికవేత్త రఘురామ కృష్ణంరాజు మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. కోడి పందాలను సంప్రదాయ క్రీడగా పరిగణించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే కత్తులు కట్టకుండా, బెట్టింగ్‌లు లేని కోడిపందాల నిర్వహణకు అనుమతించాలని పిటిషన్‌లో వెల్లడించారు. అదేవిధంగా కోడి పందేలు జరగకుండా పోలీసులు అదుపులోకి తీసుకున్న కోళ్లను రైతులకు తిరిగి అప్పగించాలని సుప్రీంకోర్టును కోరారు. ఈ వారంలో ఈ పిటిషన్ విచారణ వచ్చే అవకాశం ఉంది. సంక్రాంతి సందర్భంగా కోడి పందేలను అడ్డుకోవాలని, కఠిన చర్యలు చేపట్టాలని గత ఏడాది డిసెంబర్ 26న హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అలాగే జంతుహింస చట్టం, ఏపీ జూద నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేయాల్సిందేనని ఉభయగోదావరి, కృష్ణా,గుంటూరు జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీచేయడం తెలిసిందే.
కోడి పందాలపై ఉక్కుపాదం: హోంమంత్రి చినరాజప్ప
కాకినాడ: కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప హెచ్చరించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో రాష్ట్రంలో కోడి పందాలు నిర్వహించేవారిపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టంచేశారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర పోలీస్ శాఖకు తగిన ఆదేశాలు జారీచేశామన్నారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్‌లోని విధాన గౌతమీ సమావేశ హాలులో మంగళవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో కోడి పందాల వ్యవహారం చర్చకు వచ్చింది. దీనిపై హోంమంత్రి మాట్లాడుతూ కోడి పందాలను నిర్వహించరాదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు అందరూ కట్టుబడి ఉండాల్సిందేన్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో మూడు రోజుల పాటు కత్తులు కట్టకుండా పందాలు నిర్వహించునేందుకు అవకాశం కల్పించాల్సిందిగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి భర్త పిల్లి సత్యనారాయణమూర్తి తదితరులు హోంమంత్రిని కోరారు. దీనిపై చినరాజప్ప స్పందిస్తూ అటువంటి అవకాశమేదీ లేదని, కోడి పందాల నిర్వహణకు ఏ విధమైన ఆదేశాలు జారీ చేసే ప్రసక్తి లేదన్నారు.