ఆంధ్రప్రదేశ్‌

కుటుంబ లబ్ధిని వివరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 3: కుటుంబ వికాసం, సమాజ వికాసమే జన్మభూమి - మా ఊరు లక్ష్యం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. జన్మభూమి - మా ఊరుపై మంగళవారం తన నివాసం నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి ఊరికి ఏమి చేశామనేది ‘సమాజ వికాసం’లో వివరించాలని, గ్రామంలో జరిగిన అభివృద్ధి, చేపట్టిన సంక్షేమం, కల్పించిన వసతులు తెలియజేయాలని కోరారు. కుటుంబం వారీగా ఏమి చేశామో కూడా చెప్పగలగాలని, ప్రభుత్వ పథకాల్లో ఆయా కుటుంబాలకు కలిగిన లబ్ధిని వివరించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కర్నూలు జిల్లా తరహాలో ప్రతి ఊరికి గ్రామాభివృద్ధి కరదీపికలు తయారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
గ్రామానికి సంబంధించి ఎక్కడ చెక్ డ్యాం ఉండాలి, ఎక్కడ ఘన ద్రవ్య వ్యవస్థ (సాలిడ్ వేస్ట్ మేనేజిమెంట్ ప్లాంట్) ఉండాలి, ఎక్కడ వర్మికంపోస్టు కేంద్రం నెలకొల్పాలి, అనేది అందులో పేర్కొనాలన్నారు. దానిపై గ్రామసభల్లో సమగ్రంగా చర్చించాలని, కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. పండుగ వాతావరణంలో జన్మభూమి - మా ఊరు కార్యక్రమం జరగాలన్నారు. అద్భుతమైన కార్యక్రమం జన్మభూమి - మా ఊరు అంటూ ప్రజా చైతన్యం, జవాబుదారీ తనం, ఆనంద జీవనం జన్మభూమి లక్ష్యం కావాలని ఆకాంక్షించారు. సెర్ప్ సీఈవో కృష్ణమోహన్ మాట్లాడుతూ మొదటి రోజున 21 శాతం పింఛన్ల పంపిణీ జరిగిందని, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో 40 శాతం జరిగిందని వివరించారు. ఫిబ్రవరిలో కొత్త పింఛన్ల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ అన్ని ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీ సక్రమంగా, వేగంగా జరగాలన్నారు. పట్టిసీమ పథకం గోదావరి, కృష్ణా ప్రాంతాలకు జీవనాడి అయితే ముచ్చుమర్రి పథకం రాయలసీమకు జీవనాడి అని గుర్తు చేశారు. కెసి కెనాల్, హంద్రి - నీవా కెనాల్‌కు అనుసంధానంగా పేర్కొంటూ ముచ్చుమర్రి వల్ల రాయలసీమలో మంచి ఫలితాలు వస్తాయన్నారు. సబ్ ప్లాన్ నిధులు సద్వినియోగం చేయాలని, నేరుగా నిధులు కన్వర్జన్స్ చేసుకోవాలని సూచించారు. అన్ని వర్గాల ప్రజలను జన్మభూమిలో భాగస్వాములను చేయాలని కోరారు.
మొదటి రోజున జన్మభూమి - మా ఊరులో చేపట్టిన అంశాల గురించి ప్రణాళికా మండలి ఉపాధ్యక్షులు కు టుంబరావు, ప్లానింగ్ అధికారి శాంతిప్రియపాండే, కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రత్యేక అధికారి రాజశేఖర్ వివరించారు.
ఈ టెలికాన్ఫరెన్స్‌లో స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ డా సిఎల్ వెంకట్రావు, పంచాయతీరాజ్ కమిషనర్ రామాంజనేయులు, జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు, జన్మభూమి నోడల్ ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.