ఆంధ్రప్రదేశ్‌

మే 9న సింహాద్రి అప్పన్న చందనోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 4: సింహాచలంలో కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవం మే 9న జరుగనుంది. ఈ సందర్భంగా స్వామివారి నిజరూప దర్శనభాగ్యం భక్తులకు కలుగనుంది. సంవత్సరానికోసారి జరిగే అప్పన్నస్వామి నిజరూపదర్శనం ఏర్పాట్లను దేవస్ధానం అధికారులు చేపట్టారు. చివరి భక్తునికీ అప్పన్న నిజరూపదర్శనాన్ని కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం నాడిక్కడ వెల్లడించారు. స్వామి నిజరూపదర్శనాకి వచ్చే లక్షలాది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రొటోకాల్, విఐపి దర్శనాల సమయంలో సాధారణ భక్తుల దర్శనాలు నిలిపివేయం వల్ల గతంలో ఇబ్బందులు ఎదురయ్యాయని, ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నిరంతరాయంగా సామాన్య భక్తులకు దర్శనాలు కల్పించాలని నిర్ణయించామన్నారు. అలాగే విఐపి దర్శనాల టికెట్ల జారీ సరళతరం చేశామన్నారు. కొండపై భక్తులు వేచి ఉండేందుకు వీలుగా విఐపి, ప్రొటోకాల్ వాహనాలను సైతం కొండ దిగువనే నిలిపివేసి, దేవస్థానం ఏర్పాటు చేసే ప్రత్యేక వాహనాల్లో తీసుకువెళ్లనున్నట్టు మంత్రి తెలిపారు. వివిఐపి భక్తుల వాహనాలను కొండపైకి ప్రత్యేక మార్గంలో అనుతిస్తామన్నారు. రూ.1000 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులను కొండపైకి తరలించేందుకు ప్రత్యేకంగా ఎసి బస్సులు నడుపుతామన్నారు. భక్తులు కొనుగోలు చేసిన టికెట్లపై వారికి కేటాయించిన సమయాన్ని స్పష్టంగా ముద్రిస్తామన్నారు. నకిలీలను నిరోధించేందుకు హోలోగ్రామ్‌తో కూడిన టికెట్లు జారీ చేయనున్నట్టు తెలిపారు.