ఆంధ్రప్రదేశ్‌

స్మార్ట్ సిటీ కార్పొరేషన్ల ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 3: రాష్ట్రంలోని ఆరు మున్సిపల్ కార్పొరేషన్లను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ఆయా నగరాల పేరుతో స్మార్ట్ సిటీ కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కర్నూల్, ఏలూరు, అనంతపురం నగర పాలక సంస్థలను రాష్ట్ర ప్రభుత్వ నిధులతో స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేసేందుకు నిర్ణయించడం తెలిసిందే. ఈ నగరాల్లో వౌలిక సదుపాయలను కల్పించేందుకు వీలుగా స్మార్ట్ సిటీ కార్పొరేషన్ల పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్స్‌ను ఏర్పాటు చేసింది. కంపెనీ యాక్టు కింద ఏర్పాటైన ఈ కార్పొరేషన్ ఒక్కో దానికి 33 కోట్ల రూపాయలను ఏటా కేటాయిస్తుంది. ఈ విధంగా మూడు సంవత్సరాల పాటు ప్రభుత్వం అందచేస్తుంది. కార్పొరేషన్ల సిఇఒలుగా జిల్లా కలెక్టర్లు వ్యవహరిస్తారు.