ఆంధ్రప్రదేశ్‌

సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 3: ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, జన్మభూమి - మాఊరు కార్యక్రమాల ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించుకోవాలని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి సతీష్‌చంద్ర కోరారు. నాల్గవ విడత జన్మభూమి కార్యక్రమంలో భాగంగా మంగళవారం కంకిపాడు మండలం, కుందేరు గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి సతీష్‌చంద్ర ముఖ్య అతిథిగా, జిల్లా కలెక్టర్ బాబు.ఎ., శాసనసభ్యుడు బోడేప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సతీష్‌చంద్ర మాట్లాడుతూ కుందేరు గ్రామంలో 103 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు కాగా 81 పూర్తిచేయగా ఇంకనూ నిర్మించవలసిన 16 మరుగుదొడ్లను నిర్మించాలని, అవసరమైతే సామూహిక మరుగుదొడ్ల నిర్మాణాలను చేపట్టి పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. డ్వాక్రా సంఘాలకు చెందిన గ్రూపు సభ్యులకు 10వేల రూపాయలు అడ్వాన్స్‌గా తొలిసారిగా మన జిల్లాలోనే అందిస్తున్నారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నగదురహిత లావాదేవీలు నిర్వహించుకోవాలని పెద్దనోట్ల రద్దు నేపధ్యంలో కొత్త కరెన్సీ ముద్రణకు కొంత సమయం పడుతున్నందున దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో వుంచుకుని నగదురహిత చెల్లింపులు చేయాలని కోరారు. ఆధార్ నెంబర్‌తో బ్యాంకు ఖాతా అనుసంధానింపబడి ఎఇపిఎస్ విధానంలో సులువుగా నిర్వహించుకోవచ్చని కోరారు.