ఆంధ్రప్రదేశ్‌

నోబెల్ సాధిస్తే వందకోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 4: ‘మీ మీద నాకు ఎంతో నమ్మకం ఉంది. మీరే భవిష్యత్ శాస్తవ్రేత్తలు, నోబెల్ విజేతలు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు నోబెల్ బహుమతిని గెలుచుకుంటే వారికి రూ.100 కోట్లు నజరానా ఇస్తా, సరిపోతుందా?’ అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీపద్మావతి మహిళ విశ్వవిద్యాలయంలో బుధవారం ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో భాగంగా ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్‌ను సిఎం ప్రారంభించారు. అనంతరం జాతిపిత మహాత్మగాంధీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఈ సదస్సుకు దేశం నలుమూలల నుంచి హాజరైన 500 మంది బాలమేధావుల్లో ఉత్సాహాన్ని నింపేలా సిఎం ప్రసంగించారు. 10నుంచి 17ఏళ్ల లోపు విద్యార్థుల్లోనే ఆసక్తి, ఆలోచనలు ఎక్కువగా ఉంటాయని, ఐదేళ్లలోని వారు ఎక్కువగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. 35ఏళ్లు దాటిన వారిలో ఆసక్తి, ఆలోచనలు, ఉత్సాహం ఉండవని తెలిపారు. విద్యార్థుల్లో సైన్స్‌పట్ల అవగాహన, ఆసక్తి పెంపొందించే బాధ్యతను ఉపాధ్యాయులు తీసుకుకోవాలన్నారు. ప్రతి కుటుంబంలో టెక్నికల్ ఎక్స్‌పర్ట్‌లు తయారు కావాలన్నారు. నేటి పరిస్థితుల్లో పిల్లలే పెద్దలకు కంప్యూటర్‌పైన అవగాహన కల్పించేలా తయారవటం శుభ పరిణామమని అన్నారు. ఒక చిన్న ఆలోచనే భవిష్యత్తుకు, నూతన ఆవిష్కరణలకు దోహదం చేస్తుందన్నారు. ఇందుకు నిదర్శనమే హుదుద్ తుఫాన్ సందర్భంగా విశాఖ తీవ్రంగా దెబ్బతిన్నప్పుడు విద్యుత్ దీపాల పునరుద్ధరణ సమయంలో ఎల్‌ఇడి బల్బులు వాడామన్నారు. దీనివల్ల ఖర్చు భారీగా తగ్గిందన్నారు. చివరికి రాష్ట్ర రాజధాని అమరావతిలో సైతం 5.5 లక్షల ఎల్‌ఇడి బల్బులు వాడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఇంటర్నెట్, ఫోన్, చానల్స్, వీడియోకానె్ఫరెన్స్ నిర్వహించడానికి అవసరమైన కేబుల్ వేయడానికి 5వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తే, విద్యుత్ స్తంభాల ద్వారా వైర్లను ఇంటింటికి కనెక్ట్ చేయాలన్న ఆలోచనతో కేవలం రూ.350 కోట్లు మాత్రేమే ఖర్చు అయ్యేలా చేయగలిగామన్నారు. ఒబర్ ఇండియా చిన్న ఆలోచనే అయినే నేడు పెద్ద వ్యాపార నిర్వహణకు బాటలు వేసిందన్నారు. అమెజాన్.కాం, మైక్రోసాఫ్ట్, ఆపిల్ ఇలా ఎన్నో నూతన ఆలోచనలతో ఏర్పడి నేడు అధిక లాభాలు సంపాదిస్తున్న సంస్థలుగా మారాయన్నారు. ఆపిల్ సంస్థ నిర్వాహకుడు నాదెళ్ల సత్య మన ఆంధ్రుడేనని సి ఎం ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను డిజిటల్ పాఠశాలలుగా తీర్చిదిద్దుతామన్నారు. అన్ని కళాశాలలకు, హైస్కూల్స్‌కు వైఫై సౌకర్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థి సరికొత్త ఆలోచనలు, ఆవిష్కరణలకు సిద్ధమై శాస్తవ్రేత్తలుగా ఎదగాలన్నారు. పరిశోధనలతో అద్భుత ఫలితాలు సాధించాలని పిలుపునిచ్చారు. అన్ని పాఠశాలల్లో ఇన్నోవేషన్ చాప్టర్‌ను బోధించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తొలి నోబెల్ గ్రహీతకు రూ. 100కోట్ల బహుమతి ఇస్తామని ఈసందర్భంగా సిఎం చంద్రబాబు ప్రకటించారు. ఇందులో భాగంగా ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిని ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దడంలో భాగంగా రూ.5వేల కోట్లతో భారీ సైన్స్ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సి ఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. భవిష్యత్తులో 50వేల పాఠశాలల్లోని విద్యార్థులతో తాను ఉపాధ్యాయుడిగా ముఖాముఖి మాట్లాడే అవకాశం కలుగుతుందని చెప్పారు. మహిళల ఉన్నతికోసం దివంగత ఎన్టీఆర్ శ్రీపద్మావతి మహిళ విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేశారన్నారు. విజ్ఞాన కేంద్రంగా మారుతున్న ఈ విశ్వవిద్యాలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని సిఎం ప్రకటించారు. కాగా పాఠశాలల అభివృద్ధికి పారిశ్రామిక వేత్తలు, పూర్వపు విద్యార్థులు ముందుకు రావాల్సిన అవసరం ఉందని సిఎం పిలుపునిచ్చారు. ఈసందర్భంగా నోబెల్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ తకాకీఖజిత చేతుల మీదుగా 10మంది విద్యార్థులకు ఇన్పోసిస్ ఫౌండేషన్ ద్వారా ఇస్కా ట్రావెల్స్ అవార్డులను, ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను అందించారు. ‘‘జీవితాన్ని ఆస్వాదించండి... కష్టపడి చదివి ప్రతి ఒక్కరూ నోబెల్ విజేతలుగా నిలవాలంటూ సిఎం విద్యార్థులకు పిలుపునిచ్చారు.
జపాన్ నోబెల్ గ్రహీత ప్రొఫెసర్ తకాకికజిత మాట్లాడుతూ కష్టపడి చదవడం, పనిచేయడమేనని నోబెల్ పురస్కారం దక్కించుకోవటం వెనుక రహస్యమని అన్నారు. అదే విషయాన్ని సిఎం విద్యార్థులతో ప్రస్తావిస్తూ కష్టపడి పనిచేయడం జపనీయుల లక్ష్యమని అన్నారు. తనకు కూడా కష్టపడి పనిచేయడమంటే ఎంతోఇష్టమన్నారు. మీరు నోబెల్ గ్రహీతలు కావాలంటే ఏం చేయాలో చెప్పండి అంటూ సిఎం ప్రశ్నించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వర్క్‌హార్డ్... వర్క్ హార్డ్ అంటూ నినాదాలు చేశారు. వెరీ గుడ్ అన్న సి ఎం భారత్‌కు భవిష్యత్తులో నోబెల్ బహుమతులను సాధించి పెట్టే నోబెల్ గ్రహీతలు కనిపిస్తున్నారని అన్నారు. తాను మాత్రం విద్యార్థులను కష్టపడి చదవడమే కాకుండా జీవితాన్ని కూడా ఎంజాయ్ చేయాలని చెబుతానని సిఎం వేదికపై నుంచి పిలుపునిచ్చారు.

చిత్రం... తిరుపతిలో చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్‌ను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతున్న ముఖ్యమంత్రి