ఆంధ్రప్రదేశ్‌

డిఎంఇ ఆఫీసులో ఇదేం దారుణం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 5: విజయవాడకు ఇటీవలే తరలివచ్చిన డైరక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో దాదాపు మూడువేలకు పైగా మెడికల్ బిల్లులు గురువారం తెల్లవారుజామున అగ్నికి ఆహుతయ్యాయి. వీటిలో మంజూరు కోసం పరిశీలనలో ఉన్నవి 300 బిల్లులు కాగా, మిగిలినవి పరిశీలన పూర్తయిన బిల్లులని తెలుస్తోంది. బిల్లుల దగ్ధం వెనుక పెద్ద కుట్ర దాగి ఉన్నట్లు స్పష్టంగా కన్పిస్తోంది. ఈ కార్యాలయంలో బిల్లులు దగ్ధం కావడం గత ఐదు రోజుల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. పరిశీలనలో ఉన్న బిల్లులన్నీ సంబంధిత ఉద్యోగుల కంప్యూటర్ టేబిళ్లపై కుప్పపోసి ఉంటే మిగిలిన బిల్లులన్నీ కనీసం గోతాల్లో కూడా భద్రపరచకుండా మరుగుదొడ్ల సమీపంలో అదీ బహిరంగ ప్రదేశంలో పారేయడం సిబ్బంది నిర్లక్ష్యానికి పరాకాష్ట. గుర్తు తెలియని దుండగులు తెల్లవారుఝామున ముందుగా పాత ప్రభుత్వాసుపత్రిలోని ఈ కార్యాలయంలోకి ప్రవేశించి, మెడికల్ రీయింబర్స్ బిల్లుల పరిశీలన విభాగంలోకి తలుపులు పగులగొట్టుకొని లోపలికెళ్లి బల్లపై కుప్పగా పోసివున్న బిల్లులన్నింటిని తగులబెట్టి కంప్యూటర్ మానిటర్‌ను తమ వెంట తీసుకువెళ్లారు. ఇదే సమయంలో మరికొందరు దుండగులు వెలుపలనున్న రెండువేలకు పైగా బిల్లులను తగులబెట్టారు. కొంతసేపటి తర్వాత గస్తీ తిరుగుతున్న వాచ్‌మెన్ మంటలను చూసి అందుబాటులోనున్న వైద్యాధికారులు, ఇతర సిబ్బందిని పిలిపించి వారి సాయంతో మంటలను ఆర్పేశాడు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఏదైనా వైద్య సహాయం కోసం ముందుగా కార్పొరేట్ ఆసుపత్రిలో చేరి వైద్య ఖర్చులన్నింటినీ తామే భరిస్తారు. ఆ తర్వాత తాము చెల్లించిన బిల్లులన్నింటినీ తమ శాఖ అధిపతి ద్వారా రీయింబర్స్‌మెంట్ కోసం డిఎంఇ కార్యాలయానికి పంపిస్తారు. అక్కడ ప్రతి బిల్లును కూలంకషంగా పరిశీలించి, వాటిని మంజూరు చేసి ఆయా శాఖలకు శాంక్షన్ ఆర్డర్లు పంపుతారు. ఈ బిల్లుల తయారీ లేదా ఆమోదంలో అవినీతి అక్రమాలు చోటు చేసుకుని ఉంటే, ఎప్పటికైనా వాటన్నింటినీ పరిశీలించే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్దేశపూర్వకంగా ఆ బిల్లులన్నింటినీ తగులబెట్టడంలో ఆంతర్యం ఎవరికీ అంతుబట్టటం లేదు. సాధారణంగానే డిఎంఇ కార్యాలయంలో బిల్లు పరిశీలనకు కనీసం మూడు నాలుగు మాసాలు పడుతుంది. ఇప్పుడు తగులబడిన బిల్లులకు డూప్లికేట్ బిల్లులను తయారుచేసుకొని పంపించడానికి ఉద్యోగులు పడబోయే బాధలు వర్ణనాతీతం. ఏది ఏమైనా ఇందులో కొందరి ఉద్యోగుల పాత్ర ఉందనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఈనెల 1వ తేదీ తెల్లవారుజామున కూడా ఇదే విభాగంలోని నాలుగు బండిల్స్‌లో వందలాది బిల్లులు తగులబడ్డాయి. అప్పుడు కూడా అక్కడి కంప్యూటర్ మానిటర్ అదృశ్యమైంది. నాడు సకాలంలో వాచ్‌మెన్ గుర్తించబట్టి మంటలను అదుపుచేయగలిగారు. అప్పుడు కాలిపోగా మిగిలిన బిల్లుల్ని ఇప్పుడు తగులబెట్టడం గమనార్హం. ఇంతటి దారుణం జరిగినప్పటికీ డైరక్టర్ ఏ మాత్రం ముందస్తు చర్యలు తీసుకోకపోవటంపై ఉద్యోగులంతా ఆగ్రహం చెందుతున్నారు. డైరక్టర్ ఎన్ సుబ్బారావు ఈ విషయాన్ని లిఖితపూర్వకంగా గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తొలుత ఈ డిఎంఇ కార్యాలయం ఇదే ఆసుపత్రిలో మరో భవనంలో ఉండేది. వాస్తుపేరిట కొత్త బ్లాక్‌లోకి ఇటీవలే తరలించారు.
మరో ఆసక్తికర అంశం ఏమిటంటే అధికారులందరికీ పెద్దమొత్తాల్లో జీతాలు, ఆపై హెచ్‌ఆర్‌ఎ అందుతున్నప్పటికీ డైరక్టర్ సహా ఆరుగురు అధికారులు ఈ కార్యాలయం పక్కన గల మరో నూతన భవనంలో తలా ఓ గదిలో నివాసం ఉంటున్నారు. ఈ భవనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2014 ఫిబ్రవరి 15న నాటి జిల్లా ఇన్‌చార్జి మంత్రి తోట నరసింహం ఇఎన్‌టి విభాగం కోసం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ విభాగం అక్కడ లేదన్నది కొసమెరుపు.

చిత్రం..అగ్నికి ఆహుతైన మెడికల్ బిల్లులు