ఆంధ్రప్రదేశ్‌

11 నుంచి శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, జనవరి 5: శ్రీశైలం మహాక్షేత్రంలో మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకుని ఈనెల 11వ తేదీ నుండి 17 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఇఓ నారాయణ భరత్‌గుప్తా తెలిపారు. సంప్రదాయాన్ని అనుసరించి శ్రీ మల్లికార్జునస్వామి వారికి ప్రతి సంవత్సరం రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారన్నారు. ఒకటి సంక్రాంతి కాగా మరొకటి శివరాత్రి అని అన్నారు. సంక్రాంతి బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా ఈనెల 11వ తేదీ ఉదయం స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారన్నారు. ప్రతి రోజు స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు, మండపారాధనలు, జపానుష్టానాలు, పంచవరణార్చనలు, స్వామి, అమ్మవార్లకు పుష్ప, శయనోత్సవాలు నిర్వహిస్తామన్నారు. అదే విధంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు స్వామి అమ్మవార్లకు వాహనసేవలు నిర్వహిస్తామన్నారు. 12న భృంగి వాహన సేవ, 13న రావణ వాహనసేవ, 14న నందివాహన సేవ, 15న పుష్పపల్లకి సేవ, 16న పూర్ణాహుతి, ధ్వజావరోహణం, 17న అశ్వవాహన సేవ ఉంటాయన్నారు.
కాగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని భక్తుల రద్దీకి అనుగుణంగా 11వ తేదీ నుండి 17 వరకు స్వామి, అమ్మవార్ల ఆర్జిత కల్యాణోత్సవాన్ని నిలుపుదల చేస్తున్నట్లు ఇఓ తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా 14వ తేదీ దేవస్థానం తరపున బ్రహ్మోత్సవ కల్యాణం నిర్వహిస్తామన్నారు. 17 వరకు కల్యాణోత్సవం నిర్వహించదలచిన శాశ్వత కల్యాణకర్తలు జనవరి 10వ తేదీలోపు జరిపించుకోవాలని సూచించారు.