ఆంధ్రప్రదేశ్‌

కృషితో లక్ష్యాలు సాధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 6: హద్దుల్లేని విజ్ఞానాన్ని సాధించేందుకు ప్రతి విద్యార్థి తపోనిష్టతో లక్ష్య సాధనకు కంకణబద్ధులు కావాలని స్విమ్స్ డైరెక్టర్, విసి డాక్టర్ టి ఎస్ రవికుమార్ పిలుపునిచ్చారు. శ్రీ పద్మావతి మహిళ విశ్వవిద్యాలయంలో శుక్రవారం జరిగిన చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విజ్ఞాన సాధనకు ఎలాంటి హద్దుల్లేవని అన్నారు. విజ్ఞానాన్ని పెంచుకునే కొద్ది పెరుగుతూనే ఉంటుందని అన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికే ప్రయత్నించాలంటూ ఆయన విద్యార్థులకు అర్థమయ్యేలా చిన్న కథను కూడా వివరించారు. ఇస్కా జనరల్ ప్రెసిడెంట్ నారాయణరావు మాట్లాడుతూ మన దేశంలో ఉన్న గొప్ప అవకాశాలు అందిపుచ్చుకుని సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో అభివృద్ధి సాధించాలన్నారు.ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరి సుమతిదావ్ర మాట్లాడుతూ ఇప్పటి వరకు భారత్‌కు ఒక్క నోబెల్ బహుమతి కూడా రాకపోయినా ఇకపై భారత్‌కు నోబెల్ బహుమతులను తెచ్చే బాధ్యత నేటి బాల శాస్తవ్రేత్తలపైనే ఉందని ఆమె గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో శ్రీ పద్మావతి మహిళ విశ్వవిద్యాలయ విసి దుర్గ్భావానీ కాకినాడ జె ఎన్ టియు వైస్ ఛాన్సలర్ ఆచార్య వి ఎస్ ఎస్ కుమార్, కాలిఫోర్నియా కాంప్యూటర్ సైన్స్ ఆచార్యులు విశ్వదత్ ముఖర్జీ, చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ కన్వీనర్ ప్రొఫెసర్ ఉమ, కో కన్వీనర్లు ప్రొఫెసర్ డి ఎం మమత, ప్రొఫెసర్ పి.విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.