ఆంధ్రప్రదేశ్‌

బాలుడు సజీవ దహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరపల్లి, ఏప్రిల్ 4: పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరులో సోమవారం మధ్యాహ్నం సంభవించిన ఘోర అగ్ని ప్రమాదంలో 38 తాటాకిళ్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఒక మూడేళ్ల బాలుడు సజీవ దహనమయ్యాడు. ప్రమాద బాధితులంతా క్వారీ కార్మికులే. వివరాలిలావున్నాయి... దుద్దుకూరు ఊరచెరువు గట్టుమీద క్వారీ కార్మికులు నివాసముంటున్నారు. మధ్యాహ్నం 1.50 గంటల సమయంలో ఒక ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఇళ్లన్నీ దగ్గర దగ్గరగా ఉండటం, ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో నిముషాల వ్యవధిలోనే మంటలు అన్ని ఇళ్లకూ వ్యాపించాయి. నిముషాల వ్యవధిలోనే 38 ఇళ్లు బూడిదకుప్పగా మారాయి. ఈ ప్రమాదంలో షేక్ రాశిడ్ (3) అనే బాలుడు సజీవ దహనమయ్యాడు. ఈ దృశ్యం చూసిన బాలుని తల్లి, మరో మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ప్రమాద సమయంలో కార్మికులంతా పనిలోకి వెళ్లడంతో కట్టుబట్టలతో మిగిలారు. జిల్లా అగ్నిమాపక శాఖాధికారి జి వీరభద్రరావు, కొవ్వూరు, నిడదవోలు అగ్నిమాపక దళాధికారులు సుబ్రహ్మణ్యం, శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదం కారణంగా 41 కుటుంబాలు నిరాశ్రయులు కాగా, సుమారు రూ.12 లక్షల ఆస్తినష్టం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న రాజమహేంద్రవరం ఎంపి మాగంటి మురళీమోహన్, గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, ఎఎంసి ఛైర్మన్ ముళ్లపూడి వెంకట్రావు, అసిస్టెంట్ కలెక్టర్ నిశాంత్‌కుమార్ సంఘటనాస్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు.