ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రానికి మకుటం.. ఫైబర్‌నెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జనవరి 6: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కలల ప్రాజెక్టు ఫైబర్‌నెట్ సదుపాయం అన్ని హంగులతో జనం ముందుకు వస్తోందని ఎపిఎస్‌ఎఫ్‌ఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడి) హరికృష్ణ పేర్కొన్నారు. కర్నూలులో శుక్రవారం ఆయన ఆంధ్రభూమితో ఫైబర్‌నెట్ గురించి మాట్లాడారు. ఒకే కనెక్షన్‌తో టివి, ఇంటర్‌నెట్, ఫోన్, ఆన్‌లైన్ మార్కెటింగ్, బిల్లుల చెల్లింపు వంటి అనేక సదుపాయాలు ఉన్న ఫైబర్‌నెట్ కనెక్షన్ దేశంలోని ప్రభుత్వరంగంలో ప్రప్రథమంగా రాష్ట్రంలో ప్రవేశపెట్టామన్నారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా మోరి గ్రామంలో సిఎం చంద్రబాబు అధికారికంగా దీన్ని ప్రారంభించారని, రానున్న కొద్దిరోజుల్లో రాష్ట్రంలోని అన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కనెక్షన్లు ఇవ్వనున్నామని తెలిపారు. నిరంతరాయ సేవలు, తక్కువ ఖర్చు, ఎక్కువ సదుపాయాలు ఫైబర్‌నెట్ ప్రత్యేకతలు అన్నారు. ప్రస్తుతం ప్రజలు ఒక్క టివి ఛానళ్ల కోసమే సగటున రూ.200 నుంచి రూ.250 వరకూ ఖర్చు చేస్తున్నారన్నారు. ఇక ఇంటర్‌నెట్ కోసం ప్రతి నెలా కనీసం రూ. 600 చెల్లిస్తున్నారన్నారు. టెలిఫోన్ ఖర్చు కూడా అదనంగా భరిస్తున్న విషయాన్ని ఈడి గుర్తుచేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫైబర్‌నెట్ ద్వారా ఈ 3 సదుపాయాలే కాకుండా ఆన్‌లైన్ కొనుగోళ్లు, బిల్లుల చెల్లింపు, వీడియోకాలింగ్, ఆన్‌డిమాండ్ సినిమా, వాల్యూయాడెడ్ సర్వీసు వంటి పలు సదుపాయాలు కేవలం రూ.149తో ప్రారంభమవుతాయని వెల్లడించారు. గృహవినియోగదారుల కోసం నెలకు రూ.149, రూ.399, రూ.599తో మూడు టారిఫ్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ ప్యాకేజీలన్నింటిలోనూ ఇంటర్‌నెట్ వేగం 15 ఎంబిపిఎస్, 250 టివి ఛాచానళ్లు, టెలిఫోన్ సదుపాయం కల్పిస్తామని వివరించారు. ఇక వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థల్లో ఇంటర్‌నెట్‌వేగం 100 ఎంబిపిస్ ఉంటుందని, వారి కోసం ప్రత్యేక టారిఫ్‌లను రూపొందించామని తెలిపారు. ఇంటర్‌నెట్ వినియోగం టారిఫ్‌ను బట్టి ఉంటుందని ఆ పరిధి దాటితే 1 ఎంబిపిఎస్ వేగంతో అపరిమితంగా వినియోగించుకోవచ్చన్నారు. ముఖ్యంగా ఫైబర్‌నెట్‌లో అంతరాయం ఉండదన్నారు. ఎక్కడైనా ఫైబర్‌కేబుల్ తెగిపోయిన పక్షంలో మరోవైపు నుంచి ఇంటికి ఇంటర్‌నెట్, టివి ప్రసారాలు సరఫరా చేస్తామన్నారు. ఫైబర్‌నెట్ కనెక్షన్ కావాలనుకున్న వినియోగదారులు రూ. 4వేలు వెచ్చించి రెండు బాక్సులు కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన జి.పాన్, ఐపిటీవి బాక్సులు ఇస్తామన్నారు.
సాధారణ కలర్ టీవీయే కంప్యూటర్ మానిటర్
ప్రస్తుతం తాము అందజేస్తున్న హెచ్‌డి క్వాలిటీ బాక్సుల ద్వారా సాధారణ కలర్ టీవిలను ఇంటర్‌నెట్ వినియోగం కోసం వాడుకోవచ్చని ఆయన తెలిపారు. ఏవి కేబుల్ ద్వారా టీవికి ఇంటర్‌నెట్ కనెక్ట్ చేసుకోవచ్చన్నారు. దానికి అనుసంధానంగా కీ బోర్డు, వౌస్ ఏర్పాటు చేసుకుంటే ఆన్‌లైన్ క్రయ, విక్రయాలు, వీడియోకాల్, బిల్లుల చెల్లింపు వంటివి చేసుకోవచ్చని సూచించారు. ఈ తరహా పరిజ్ఞానం దేశంలో ఏ రాష్ట్రంలో లేదని తెలిపారు.