ఆంధ్రప్రదేశ్‌

స్మార్ట్ సిటీగా రాజాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జనవరి 6: శ్రీకాకుళం జిల్లాలోని రాజాం పట్టణం రాష్ట్రంలోనే అపూర్వమైన సిటీగా రూపుదిద్దుకోనుంది. ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన ప్రముఖ వ్యాపారవేత్త గ్రంధి మల్లికార్జునరావు చొరవను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అభినందించారు. స్మార్ట్‌సిటీ నిర్మాణానికి తనవంతు పూర్తిసామర్థ్యాన్ని జిఎంఆర్ సంస్థ నుంచి వినియోగిస్తూ, ఆస్ట్రేలియా ఆర్కిటెక్ట్ ఇంజనీర్ల బృందాలచే హంగులు దిద్దిస్తానంటూ జిఎంఆర్ ముఖ్యమంత్రికి భరోసా ఇచ్చారు. రాజాంలో శుక్రవారం జన్మభూమి-మా ఊరు కార్యక్రమం జరిగింది. జిఎంఆర్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించి, రాజాం రూపురేఖలు మార్చేందుకు జిఎంఆర్ కృషిని ప్రజలముందు ముఖ్యమంత్రి వెల్లడించారు. రాజాంలో ప్రత్యేంగా టౌన్‌షిప్ నిర్మించడానికి 34 ఎకరాల భూమి ఉచితంగా జిఎంఆర్ ప్రభుత్వానికి ఇచ్చారని, అందులో మూడు వేల కుటుంబాలకు ప్లాటులు అత్యాధునికంగా నిర్మాణం చేస్తామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం రూ. 1.50 లక్షల రూపాయలు ఇవ్వగా, మరో 1.50 లక్షల రూపాయలు రాష్ట్ర సర్కార్ భరిస్తుందన్నారు. కానీ, ఆ భవంతులు జిఎంఆర్ నుంచి రావాలంటూ ముఖ్యమంత్రి కోరారు. జిఎంఆర్ ట్రస్టు రాజాంలో ఇప్పటికే ఆసుపత్రి, విద్యాసంస్థలు ఏర్పాటు చేసిందన్నారు.
జిఎంఆర్ సంస్థలో 12.5 శాతం ఇక్విటి ట్రస్టుకు వినియోగిస్తున్నారని, అంటే రూ. 150 కోట్లుగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో జిఎంఆర్ షేర్లు వాణిజ్యవిపణీలో పెరిగేకొద్ది అమరావతి అభివృద్ధికి జిఎంఆర్ సహాయసహకారాలు అందిస్తారన్న ఆశాభావాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు.