ఆంధ్రప్రదేశ్‌

ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేలపై చార్జిషీటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జనవరి 6: 2014 సార్వత్రిక ఎన్నికల్లో నకిలీ మద్యం కేసులో సిబిసిఐడి చార్జిషీటు దాఖలు చేసింది. వైకాపా ఎమ్మెల్యేలు కాకాణి గోవర్దన్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిలతోపాటు మరి కొందరిపై సిబిసిఐడి అధికారులు శుక్రవారం నెల్లూరు రెండో అదనపు మేజిస్ట్రేట్ కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డితోపాటు మరికొందరు ఓటర్లకు నకిలీ మద్యం పంపిణీ చేసి వారి అనారోగ్యానికి కారకులయ్యారని సిబిసిఐడి చార్జిషీటులో పేర్కొంది.
మొరాయిస్తున్న సర్వర్లు..నిలిచిన రేషన్ పంపిణీ
విజయవాడ, జనవరి 6: సర్వర్లు మొరాయిస్తుండటంతో రాష్ట్రంలో పలు చోట్ల రేషన్ సరకులు, సంక్రాంతి కానుకలను పంపిణీ చేయలేని పరిస్థితి నెలకొంది. గత మూడు రోజులుగా రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉంది. పెరిగిన రేషన్ కార్డులు, నగదు రహిత లావాదేవీలకు అనుగుణంగా ఈ-పోస్ యంత్రాలకు సంబంధించిన సర్వర్లు సరిగా పని చేయడం లేదు.