ఆంధ్రప్రదేశ్‌

గోదావరి గట్టున ప్రాజెక్టుల ముట్టడి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 7:అఖండ గోదావరి నది గట్టున ఉన్న గ్రామాల భూములు ప్రాజెక్టుల కోసం హరించుకుపోతున్నాయి..ఇటు ఎత్తిపోతల పథకాలు, పోలవరం ప్రాజెక్టు కోసం భూములు కనుమరుగవుతున్నాయి.. ఇక్కడి భూములను ప్రాజెక్టులు తన్నుకు పోతున్నాయి. ప్రాజెక్టుల రాకతో గ్రామాలు రూపాంతరం చెందుతున్నాయి. గోదావరి చెంత సారవంతమైన భూములు కలిగిన రైతులు సెంటు భూమిని సైతం త్యాగం చేయాల్సిన పరిస్థితి దాపురించింది. ఈ నేపధ్యంలో పురుషోత్తపట్నం, పరిసర గ్రామాలను సాగునీటి ప్రాజెక్టులు ముట్టడించాయని చెప్పొచ్చు. ప్రస్తుతం అఖండ గోదావరి నది ఎడమ గట్టుపై పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి అవసరమైన భూములను సేకరించేందుకు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. రూ.1638 కోట్ల అంచనా వ్యయంతో కేవలం 9 నెలల కాలంలో నిర్మించేందుకు లక్ష్యంగా నిర్ధేశించిన ఈ ప్రాజెక్టు కోసం శంకుస్థాపన తర్వాత భూములను సేకరించేందుకు అధికారులు ఎట్టకేలకు సమాయత్తమయ్యారు. భూసేకరణకు సంబంధించి రైతులతో జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ రాజమహేంద్రవరం సభ కలెక్టర్ కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఇప్పటికే పుష్కర ఎత్తిపోతల పథకం కోసం 6260 ఎకరాలను సేకరించారు. ఈ ప్రాజెక్టు కోసం కూడా పురుషోత్తపట్నం గ్రామానికి చెందిన భూములు పోతున్నాయి. పోలవరం ప్రాజెక్టులో కొన్ని భూములను సేకరిస్తే ఇపుడు గ్రామంలో మిగిలిన భూములు పురుషోత్తపట్నం ఎత్తిపోతల కోసం 122 ఎకరాలు సేకరించేందుకు నిర్ధేశించారు. పోలవరం ప్రాజెక్టు మినహా పుష్కర, ముసురుమిల్లి, భూపతిపాలెం, సూరంపాలెం, వెంకటనగరం సాగునీటి ప్రాజెక్టుల కోసం ఇప్పటికే 12వేల 662 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించారు. పోలవరం ప్రాజెక్టు కోసం ఉభయ గోదావరి జిల్లాల్లో అయితే మొత్తం 45261 ఎకరాలు అవసరంగా గుర్తించారు. సీతానగరం మండలం చినకొండేపూడి గ్రామానికి చెందిన 64 ఎకరాలు, నాగంపల్లి గ్రామానికి చెందిన 53 ఎకరాలు వెరసి పురుషోత్తపట్నం ఎత్తిపోతల పధకానికి సుమారు 240 ఎకరాల భూములు అవసరం అవుతాయని ప్రాథమికంగా గుర్తించి అధికారులు కసరత్తు ప్రారంభించారు. మొత్తంమీద ప్రాజెక్టుల పేరుతో ఉన్న ఆయకట్టే మాయమైపోయే పరిస్థితి దాపురించింది. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయే రైతుల పరిస్థితి పరిశీలిస్తే..కొంత భూమి పుష్కరలోనూ, మరి కొంత భూమి తొర్రిగడ్డ ఎత్తిపోతల పథకంలోనూ, ఇంకొంత భూమి పోలవరం ప్రాజెక్టులోనూ, చివరిగా మిగిలిన భూమి పురుషోత్తపట్నంలోనూ కోల్పోతున్నారు. దీంతో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి రైతులను ఆదుకోవాలని, అత్యధిక నష్టపరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. చివరి సెంటు భూమి వరకు కూడా సాగునీటి ప్రాజెక్టుల కోసమే త్యాగం చేసిన రైతులకు తక్షణం పరిహారం చెల్లించడంతో పాటు కొత్త చట్టం మేరకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే వివిధ సాగునీటి ప్రాజెక్టు కోసం తీసుకోగా మిగిలిన భూమి ఎటూ వ్యవసాయం చేయలేని స్థితిలో ఉంది. అటువంటి నాగలి ఆడని భూములను కూడా తీసేసుకుని న్యాయమైన రీతిలో నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారతూర్పు గోదావరి జిల్లాలోని భూపతిపాలెం, సూరంపాలెం, ముసురుమిల్లి, వెంకటనగరం, పుష్కర ఎత్తిపోతల పధకాలు, పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడిపూడి, చింతలపూడి, ఎర్రకాల్వ ప్రాజెక్టులకు ఒక లక్షా 72వేల 411 ఎకరాల భూమిని సేకరించారు. పోలవరం ప్రాజెక్టు కోసం ప్రత్యేకించి ఇప్పటి వరకు 31693 ఎకరాల భూమిని సేకరించారు.