ఆంధ్రప్రదేశ్‌

జన్మభూమిని బహిష్కరించిన బెంతొరియాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జనవరి 7: దశాబ్దాలుగా జిల్లాలో నివసిస్తున్న బెంతొరియాలను ఫలానా సామాజికవర్గమని ఇప్పటికీ ప్రభుత్వాలు గుర్తించకపోవడంతో వారంతా ఓసీలు కాక బీసీలుగా ఎటువంటి రాయితీలు పొందలేక నానా అవస్థలు పడుతున్నారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన పల్స్ సర్వేలో కూడా వీరిని నమోదు చేసేందుకు ఎటువంటి కాలమ్‌ను కేటాయించలేదు. పల్స్ సర్వే ప్రామాణికంగా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సామాజిక వర్గాల వారీగా అందిస్తామని ప్రభుత్వం స్పష్టంచేస్తున్న విషయం తెలిసిందే. ఈసర్వేలో కూడా బెంతొరియాలకు చోటు దక్కకపోవడంతో వారంతా జన్మభూమిని కూడా బహిష్కరించేందుకు సిద్ధం కావడంతో పలు గ్రామ సభలు రసాభాసగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జన్మభూమి-మా ఊరు కార్యక్రమాలను శనివారం జిల్లాలోని కవిటి మండలం కుసుంపురం, బల్లిపుట్టుగ, మాణిక్యపురం గ్రామ పంచాయతీల్లో బెంతొరియా సామాజికవర్గం బహిష్కరించింది. బల్లిపుట్టుగ గ్రామంలో బెంతులు రహదారిపై బైఠాయించి జన్మభూమికి వచ్చే అధికారులను, ప్రజాప్రతినిధులను అడ్డుకుని నిరసన తెలిపారు. ఎంపిపి బెందాళం కిరణ్‌కుమారి బెంతులకు మద్దతు ప్రకటించి బెంతులకు అనుకూలంగా మాట్లాడుతూ సాధికార సర్వేలో వీరిని ఎందుకు చేర్చలేదని అధికారులను ప్రశ్నించారు. ఈసందర్భంగా బల్లిపుట్టుగ గ్రామ సర్పంచ్ ప్రతినిధి, జిల్లా బెంతోరియా సంఘ అధ్యక్షుడు రజనీ కుమార్ దోళాయి మాట్లాడుతూ తమ కులాన్ని ఇటీవలే ప్రభుత్వం చేపట్టిన ప్రజాసాధికార సర్వేల్లో ఎందుకు చేర్చలేదని అధికారులను ప్రశ్నించారు. ఎన్నిసార్లు చెప్పిన మాగోడు పట్టించుకోరా అని నిలదీశారు. అందుకే జన్మభూమి కార్యక్రమాలు అడ్డుకుంటున్నామని ఈ విషయమై ప్రభుత్వ అధికారులు ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు. అనంతరం గ్రామంలో ప్రారంభమయ్యే జన్మభూమి గ్రామ సభ వద్దకు వెళ్లిన సర్పంచ్ బృందం తమ కుల పరిస్థితిని అధికారులకు, గ్రామస్థులు తెలియజేసి తమకు మద్దతుగా జన్మభూమి సభను నిలుపుదల చేయమని కోరారు. ఈ క్రమంలో బెంతులు, అధికార పార్టీ కార్యకర్తలు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని స్థానిక ఎస్సై పారినాయుడు ఉన్నతాధికారులకు తెలియజేయడంతో భారీ సంఖ్యలో పోలీసులు మొహరించడంతో భధ్రతా నడుమ, బెంతొరియాల నిరనసల మధ్య గ్రామ సభను అధికారులు ముగించారు. కుసుంపురం గ్రామంలో గ్రామ సర్పంచ్ బత్తిన హైమావతి కృష్ణారావు బెంతులకు మద్దతుగా అధికారులకు వినతిని అందజేసి కార్యక్రమాన్ని బహిష్కరించడంతో అధికారులు షెడ్యూల్ ప్రాప్తికి గ్రామ సభ వద్ద నిరీక్షించి వెనుతిరిగారు.

చిత్రం..బల్లిపుట్టగలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్న బెంతొరియాలు