ఆంధ్రప్రదేశ్‌

నూకలు చెల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల/బండిఆత్మకూరు, జనవరి 8 : రైతు పండించిన పంట దిగుబడులకు గిట్టుబాటు ధర ఇవ్వలేని ప్రభుత్వం ఇంకెంతో కాలం ఉండబోదని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి జోస్యం చెప్పారు. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందన్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మూడేళ్ల పాలనలో రైతులకు ఒరగబెట్టిందేమీ లేదని ధ్వజమెత్తారు. రైతు భరోసా యాత్రలో భాగంగా ఆదివారం జగన్ కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బండిఆత్మకూరు మండల పరిధిలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఇందులో భాగంగా లింగాపురం గ్రామంలో బహిరంగ సభలో జగన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. టిడిపి ప్రభుత్వం ఏనాడూ కేబినెట్ సమావేశాల్లో రైతుల కోసం చర్చించింది లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు రైతు రుణమాఫీ చేస్తానన్న టిడిపి అధినేత చంద్రబాబు మూడేళ్లు దాటినా ఇప్పటికీ పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేని దయనీయ పరిస్థితిలో ఉన్నారన్నారు. ముఖ్యంగా రాయలసీమ కరవు మండలాల్లో ఇంతవరకూ ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేకపోవడంతో ఆయా ప్రాంతాల ప్రజలు వలస బాట పట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయం పరిస్థితి మెరుగ్గా లేకపోయినా రాష్ట్ర జిడిపి దేశ జిడిపి కంటే ఎక్కువగా ఉందని గొప్పలు చెప్పుకోవడం తప్ప అభివృద్ధి సాధించింది శూన్యం అన్నారు. సీమ ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో ప్రారంభించినవే అన్నారు. ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోవడంతో పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరివ్వలేని స్థితి ఏర్పడిందన్నారు. చంద్రబాబు అమరావతి జపం చేస్తూ ఎన్నికలకు ముందు చెప్పిన రుణమాఫీ, నిరుద్యోగ భృతి వాగ్దానాలను నిలుపుకోలేకపోయారని మండిపడ్డారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా చేసిన అప్పులు చెల్లించలేక రైతులు ఆత్మహత్యకు పాల్పడుతుంటే, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉందని, సమృద్ధిగా పంటలు పండాయని అబద్ధాలు చెబుతూ కాలం గడిపేస్తున్నారని విమర్శించారు. రైతులకు రబీ సీజన్‌లో బ్యాంకుల ద్వారా రూ. 24 వేల కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటి వరకూ రూ. 4,900కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొని రైతులకు అన్యాయం చేశారన్నారు. రాష్ట్రంలోనే కర్నూలు జిల్లాలో మిర్చి, వేరుశెనగ, ఉల్లి రైతులకు గిట్టుబాటు ధరలేక అల్లాడుతుంటే ముఖ్యమంత్రికి చీమ కుట్టినట్లయినా లేదని ధ్వజమెత్తారు. యాత్రలో జగన్ వెంట కర్నూలు పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుక, నందికొట్కూరు, పాణ్యం ఎమ్మెల్యేలు ఐజయ్య, గౌరుచరితారెడ్డి, వైకాపా జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, శ్రీశైలం, నంద్యాల నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జిలు బుడ్డా శేషారెడ్డి, మలికిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఉన్నారు.

చిత్రం..సంతజూటూరు వద్ద మిరప రైతులతో మాట్లాడుతున్న వైకాపా అధినేత వైఎస్ జగన్