ఆంధ్రప్రదేశ్‌

చెక్‌పోస్టులపై ఏసిబి దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ/చిలమత్తూరు/చిత్తూరు/ఇచ్ఛాపురం, జనవరి 9: రాష్ట్ర వ్యాప్తంగా చెక్‌పోస్టులపై ఏసిబి విస్తృత దాడులు జరిపింది. కొత్త డిజిగా ఆర్పీ ఠాకూర్ బాధ్యతలు చేపట్టాక అవినీతిపరులె గుండెల్లో రైళ్లుపరుగెత్తిస్తున్నారు. తాజాగా రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టులపై ఏసిబి అధికారులు సోమవారం రాష్టవ్య్రాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కార్మిక శాఖ జాయింట్ డైరెక్టర్ అక్రమాస్తుల నిగ్గుతేల్చి రెండురోజులు కాకుండానే చెక్‌పోస్టులపై దృష్టి సారించిన డిజి ఠాకూర్ ఆకస్మిక తనిఖీలకు ఆదేశాలిచ్చారు. పొరుగు రాష్ట్రాలకు ఆనుకుని ఉన్న ఏపిలోని పలు జిల్లాల్లోని చెక్‌పోస్టుల్లో మొత్తం ఏడు బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేశారు. లెక్కలు లేని అనధికారిక సొమ్ము రూ.2,55,665 లక్షలు సీజ్ చేశారు. ఇచ్ఛాపురం వద్ద పురుషోత్తపురం చెక్‌పోస్టు తనిఖీల్లో 65వేలు అనధికార నగదు, ఆంధ్రా-తమిళనాడు సరిహద్దు నెల్లూరు జిల్లా తడ చెక్‌పోస్టుపై దాడి చేసి 59వేల 700 అనధికార సొమ్ము, అదేవిధంగా చిత్తూరు జిల్లా నరహరిపేట చెక్‌పోస్టు తనిఖీలో రూ.52,630 వేలు, చిత్తూరు జిల్లా పలమనేరు చెక్‌పోస్టు తనిఖీలో 36,900 రూపాయలు, ఆంధ్రా-తెలంగాణ సరిహద్దులోని గుంటూరు జిల్లా పొందుగుల చెక్‌పోస్టు తనిఖీలో 22,170 రూపాయలు, ఆంధ్రా-కర్నాటక సరిహద్దు అనంతపురం జిల్లా పెనుగొండ చెక్‌పోస్టు తనిఖీలో రూ,14,765 రూపాయలు, పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి చెక్‌పోస్టు తనిఖీలో 4,500 రూపాయలు మొత్తం రూ.2,55,665 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం తెల్లవారుఝామున 2గంటలకు ఈ దాడులు నిర్వహించారు. అనంతపురం జిల్లాలోని వాణిజ్య పన్నులశాఖ చెక్‌పోస్టుపై సోమవారం ఎసిబి అధికారులు దాడులు జరిపి రూ.14,765 నగదు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ అనధికారికంగా విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
చిత్తూరు,నెల్లూరు జిల్లాల్లో రవాణా, వాణిజ్య పన్నుల శాఖల చెక్ పోస్టు అక్రమ వసూళ్లకు అడ్డాగా మారాయి. సమాచారం అందుకున్న ఏసిబి అధికారులు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పలు చెక్‌పోస్టుల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈనేపథ్యంలో చిత్తూరు జిల్లాలోని గుడిపాల మండలంలోని నరహరిపేట, పలమనేరు ప్రాంతాల్లోని వాణిజ్య పన్నుల శాఖ చెక్ పోస్టులపై దాడుల నిర్వహించి లెక్కల్లో చూపని సుమారు 86వేల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నరహరిపేట వద్ద 51,200 రూపాయలు, పలమనేరులో అదనంగా ఉన్న 35వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఉన్న ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులను విచారించి వారి ఇళ్లను సైతం తనిఖీచేశారు. అయితే వారి వద్ద ఎలాంటి నగదు లభ్యంకాకపోవడంతో కార్యాలయంలో అదనంగా ఉన్న నగదు వ్యవహారంపై కేసునమోదు చేశారు. అనంతరం అక్కడే ఉన్న రవాణాశాఖకు చెందిన చెక్ పోస్టులోను సోదాలు చేశారు. తడ మండలం భీములవారిపాలెం ఉమ్మడి తనిఖీ కేంద్రం,రవాణాశాఖ చెక్‌పోస్టుపై సోమవారం తెల్లవారుఝామున 2 గంటల ప్రాంతంలో దాడులు నిర్వహించారు.్ల ఇచ్ఛాపురం పరిధిలోని పురుషోత్తపురం ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టుపై ఎసిబి అధికారులు సోమవారం దాడి చేశారు. వాణిజ్య పన్నుల శాఖ, వ్యవసాయ మార్కెట్ కమిటీ కౌంటర్లలో అక్రమంగా వసూలు చేసిన 31 వేలు, లారీల సిబ్బంది నుంచి దళారులు వసూలు చేసిన 33 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.