ఆంధ్రప్రదేశ్‌

గోదావరి డెల్టాకు వంతులవారీ నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 9: గోదావరి నదిలో నానాటికీ నీటి లభ్యత క్షీణిస్తుండటంతో గోదావరి జిల్లాల్లో రబీ పంటను గట్టెక్కించడంపై జల వనరుల శాఖ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఇందులోభాగంగా వంతులవారీ విధానాన్ని అవలంభించడానికి జల వనరుల శాఖ అధికారులు కసరత్తుచేస్తున్నారు. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణం సాగుచేసేలా రైతులను సమాయత్తం చేస్తున్నారు. గోదావరి నదిలో రానున్న రోజుల్లో నీటి లభ్యత మరింత క్షీణించిపోయే పరిస్థితి ఉన్నట్టు సమాచారం. దీనితో ప్రమాద ఘంటికలను ముందుగానే పసిగట్టిన జలవనరుల శాఖ అధికారులు తక్కువ నీరు వినియోగాన్ని రైతులకు ముందుగానే అలవాటుచేస్తున్నారు. రబీ నాట్లు పూర్తయిన తర్వాత వంతుల వారీ విధానాన్ని అవలంభించనున్నారు. తూర్పు డెల్టా కంటే దాదాపు నెల రోజుల పాటు ఆలస్యంగా మధ్య డెల్టాలో సాగు జరుగుతోంది. పశ్చిమ డెల్టాలో కాస్తంత ముందుగానే సాగు పనులు చేపట్టడంతో దాదాపు నాట్లు పూర్తయ్యే స్థితికి చేరుకుంది. దాదాపు నెల రోజులు ఆలస్యంగా నాట్లు పడ్డాయి. ఈ నెల 12, 13 నాటికి రబీ నాట్లు పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనావేస్తున్నారు. కోనసీమలోని ఐ.పోలవరం ప్రాంతంలో నాట్లు మరీ ఆలస్యమవుతున్నాయని గోదావరి బేసిన్ చీఫ్ ఇంజనీర్ ఎస్ హరిబాబు సోమవారం చెప్పారు.