ఆంధ్రప్రదేశ్‌

అంతర్జాతీయ స్థాయకి గన్నవరం ఎయర్‌పోర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 11: నిన్నామొన్నటి వరకు ఓ సాధారణ, దేశీయ స్థాయి గన్నవరం విమానాశ్రయం గురువారం నుంచి అంతర్జాతీయ చిత్రపటంలో చోటు సంపాదించుకోబోతుంది. రూ.162 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇంటర్నేషనల్ టెర్మినల్ భవనం గన్నవరం విమానాశ్రయం రూపురేఖలను సమూలంగా మార్చేయబోతోంది. ఈ టెర్మినల్‌ను గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమానికి పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, సమాచార, ప్రసారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు, సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి వైఎస్ చౌదరి పాల్గొంటున్నారు. రాష్టవ్రిభజన తర్వాత నవ్యాంధ్ర రాజధానికి సమీపంలో అంతర్జాతీయ విమానాశ్రయం లేకపోవడం లోటుగా మారింది. విభజన హామీలలో భాగంగా గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో వేగంగా తీర్చిదిద్దారు. ఒకటి రెండు సర్వీసులతో చిన్నపాటిగా ఉన్న గన్నవరం విమానాశ్రయం ఏడాది కాలంలోనే 24 సర్వీసులతో రద్దీగా మారిపోయింది. విజయవాడ నుంచి ఢిల్లీ సహా దేశంలోని అన్ని ప్రముఖ నగరాలకు సర్వీసులు నడిపేలా ప్రణాళికలు రూపొందించారు. ఇటీవలే కాశీకి కూడా ఓ సర్వీసును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సర్వీసులు పెరిగినకొద్దీ ఇక్కడి నుంచి విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2016-17 తొలి అర్ధ సంవత్సరంలోనే విమాన ప్రయాణికుల సంఖ్య 70 శాతానికి పెరిగింది. త్వరలోనే దుబాయ్, సింగపూర్‌తో పాటు పలు ఆసియా దేశాలకు అంతర్జాతీయ సర్వీసులు నడపాలని భావిస్తున్నారు. ఇదే జరిగితే కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల ప్రజలు హైదరాబాద్ వెళ్లే అవసరం లేకుండా నేరుగా గన్నవరం నుంచి విదేశాలకు వెళ్లే సౌకర్యం ఏర్పడుతుంది. రెండు ఫ్లోర్లతో కొత్తగా నిర్మించిన అంతర్జాతీయ టెర్మినల్ ద్వారా భారీ సంఖ్యలో ప్రయాణికులు గన్నవరం నుంచి రాకపోకలు సాగించడానికి వీలు కలుగుతుంది. రూ.17.63 కోట్లతో నిర్మించిన ఏప్రాన్ కారణంగా ఎబి 320, ఎబి 321 తరహా 10 విమానాలు నిలవడానికి అవకాశం ఏర్పడింది. ఇంటర్నేషనల్ టెర్మినల్‌ను స్టీల్, గ్లాస్‌తో తొమ్మిది మీటర్ల ఎత్తులో నిర్మించటంతో చూడ్డానికి ఆకర్షణీయంగా మారింది. మొత్తం 300 కార్లను పార్క్ చేయడానికి అవకాశం ఉంది. బ్యాగేజీ హ్యాండ్లింగ్ సిస్టం, అరైవల్ బ్యాగేజ్ క్లెయిమ్ కరౌసిల్స్, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్, పబ్లిక్ అడ్రస్ సిస్టం, ఫైర్ అలారం సిస్టం, ఫ్లయిట్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే సిస్టం, నిఘా కోసం సిసిటీవీ కెమెరాలు, కామన్ యూజ్ టెర్మినల్ ఎక్విప్‌మెంట్‌తో 18 చెక్‌ఇన్ కౌంటర్లు, సెరిమోనియల్ లాంజ్, కాన్ఫరెన్స్ హాల్, ఎయిర్‌లైన్స్ కోసం బ్యాకప్ ఆఫీస్, వివిఐపీల కోసం ప్రత్యేకంగా అప్రోచ్ రోడ్డు నిర్మించారు. నూతన టెర్మినల్ గోడలపై గ్రీనరీ, నీటి ఫౌంటేన్లు, గాజు కనోపీలు, కొండపల్లి బొమ్మలు, కలంకారీ కళతో కూడిన అలంకరణలు అదనపు ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. ఇంటర్నేషనల్ టెర్మినల్ ప్రారంభోత్సవంతో పాటు రన్‌వే విస్తరణకు కూడా భూమిపూజ జరగనుంది. ఇప్పటివరకు 2886 మీటర్లుగా ఉన్న రన్‌వేను 3360 మీటర్లకు పొడిగించనున్నారు. దీంతోపాటే ఐసోలేషన్ బే నిర్మాణం, బ్లాస్ట్ కురోజన్ రాకుండా పేవ్‌మెంట్ నిర్మాణం, రన్‌వే చివర రక్షణ ప్రదేశం, రన్‌వే పొడవునా లైటింగ్ సిస్టం, అప్రోచ్ లైటింగ్, పెరీమీటర్ లైటింగ్, ప్రహరీ గోడ నిర్మాణం వంటి పనులు చేపడతారు. రన్‌వే నిర్మాణం పూర్తయితే కోడ్ ఇ తరహా విమానాల (బి 747400) రాకపోకలకూ అవకాశం ఏర్పడుతుంది.