ఆంధ్రప్రదేశ్‌

మోదీకి భీమవరం పూతరేకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జనవరి 11: ప్రధాని నరేంద్రమోదీ అమితంగా ఇష్టపడే పూతరేకులను సంక్రాంతి కానుకగా పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం భారతీయ జనతా పార్టీ నేతలు ఆయనకు అందించనున్నారు. రాష్ట్ర పార్టీ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న పురిగెళ్ళ రఘురాం ఇప్పటికే వీటిని తయారుచేయించి ఢిల్లీకి తీసుకువెళ్లారు.
నెయ్యి, జీడిపప్పు, బెల్లం, హార్లిక్స్‌తో వీటిని సాంప్రదాయబద్దంగా తయారుచేయించారు. పూతరేకులతోపాటు రాజులడ్డూ, అరిసెలను ప్రధానికి అందించేందుకు తీసుకువెళ్లారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీతోపాటు ఆలిండియా పార్టీ అధ్యక్షులు అమిత్‌షా, బిజెపి అగ్రనేత అద్వానీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, నితిన్‌గడ్కారీలకు వీటిని అందివ్వనున్నారు. ఇదిలా ఉండగా ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ రైతాంగానికి ఎంతో అవసరమైన పోలవరం ప్రాజెక్టుకు భారీగా నిధులు ఇవ్వడం, కేంద్ర విద్యాసంస్థలు ఏర్పాటుచేయడం, సాగరమాలలో మరింత ప్రాధాన్యత ఇచ్చారని రఘురాం చెప్పారు. ఇన్ని వరాలు ఇచ్చిన మోదీకి తెలుగు ప్రజలు సాంప్రదాయంగా చేసుకునే సంక్రాంతి పండుగ మిఠాయి రాష్ట్ర ప్రజలు తరుపున అందిస్తున్నామని తెలిపారు.

శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
శ్రీశైలం, జనవరి 11: శ్రీశైలంలో సంక్రాంతి బ్రహోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను ఆగమ శాస్త్రానుసారం పూజలు, యాగశాల ప్రవేశంతో అర్చకులు, దేవస్థానం ఇఓ భరత్‌గుప్తా ప్రారంభించారు. అనంతరం మహాగణపతి పూజ, కంకణపూజ నిర్వహించారు. అఖండ స్థాపన, వాస్తుపూజ, మండపారాధన, ప్రధాన కలశస్థాపన నిర్వహించారు. సాయంత్రం అంకురార్పన, అగ్నిప్రతిష్టాపన అనంతరం ధ్వజారోహణం గావించారు. స్వామి వాహనమైన నందిని చిత్రీకరించిన ధ్వజాన్ని ఎగురవేయడం ద్వారా ఉత్సవాలకు సకల దేవతలను ఆహ్వానించారు. ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం స్వామి, అమ్మవార్లకు భృంగివాహన సేవ నిర్వహించనున్నారు.