ఆంధ్రప్రదేశ్‌

త్వరలో డిజిటలైజేషన్ కమిటీ మధ్యంతర నివేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 12: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ముఖ్యమంత్రులతో ఏర్పాటు చేసిన డిజిటలైజేషన్ కమిటీ తన నివేదికను త్వరలో ఇవ్వనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విజయవాడలో నాబార్డు ఆధ్వర్యంలో స్టేట్ క్రెడిట్ సెమినర్‌ను గురువారం నిర్వహించారు. ఈసందర్భంగా ము ఖ్యమంత్రి మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు అనంతరం ఏర్పడినే పరిస్థితులను ఈ నివేదికలో పొందుపరచనున్నట్లు వెల్లడించారు. పూర్తి స్థాయి నివేదిక కూడా త్వరలో అందచేస్తామన్నా రు. పెద్ద నోట్ల రద్దు వల్ల ఇంకా అనేక రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయని, కానీ తమ రాష్ట్రంలో మాత్రం 60 రోజుల్లోనే అధిగమించగలిగామన్నారు. ఈ సమస్యను ఒక సవాల్‌గా తీసుకోవడం వల్ల సాధ్యమైందన్నారు. మార్చి నాటికి నగదు రహిత లావాదేవీలు ఎక్కువ సంఖ్యలో ఉండేలా చర్యలు చేపడుతున్నామన్నారు. రాబోయే రెండేళ్లలో ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా ప్రతి కుటుంబంలో కంప్యూటర్ విజ్ఞానంతో పాటు ఒకరు కూచిపూడి నృ త్యం నేర్చుకునేవారు ఉంటారని తెలిపారు. కులమతాలకు అతీతంగా అందరూ కూచిపూడిని నేర్చుకుంటున్నారని గుర్తు చేశారు. 28 శాతం వర్షపాతం తక్కువైనా వ్యవసాయంలో 24.4 శాతం వృద్ధిని సాధించామని గుర్తు చేశారు.

చిత్రం..సదస్సులో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు