ఆంధ్రప్రదేశ్‌

కోడి పందాలు కాదు..కుస్తీ పోటీలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జనవరి 12: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, న్యాయస్థానాలను గౌరవిస్తూ సంక్రాంతి పండుగకు కోడి పందాలకు బదులు ‘కోళ్ల కుస్తీ పోటీలు’ నిర్వహిస్తున్నామని బిజెపి నేత కనుమూరి రఘురామకృష్ణంరాజు ప్రకటించారు. ‘ఇద్దరు మనుషులు తలపడితే కుస్తీ అంటున్నారు.. దానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉంది... గెలిచిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందిస్తున్నారు... అదే మాదిరిగా కోళ్ల కుస్తీ పోటీలు నిర్వహించి, గెలిచిన కోళ్లకు బహుమతులు అందిస్తామన్నారు. కోడిపందాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లిన రఘురామకృష్ణంరాజు గురువారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విలేఖర్లతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 1974 గేమింగ్ యాక్టు ఉందని, దాన్ని అందరూ గౌరవించాలన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 1960 యానిమల్ క్రూయల్ యాక్టు ఉందని, దీని ప్రకారం హింసకు తావులేకుండా పందాలు వేసుకోవాలన్నారు.

చిత్రం..పందెం పుంజులతో బిజెపి నేత రఘు రామకృష్ణంరాజు