ఆంధ్రప్రదేశ్‌

ఆనందమే జీవిత మకరందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 13: మూలాలను మర్చిపోతున్న సమయంలో వాటిని సజీవంగా ఉంచాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, ఆధునిక యుగంలో టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని ‘ఎ’ కనె్వన్షన్ సెంటర్‌లో నిర్వహించిన రాష్టస్థ్రాయి సంక్రాంతి సంబరాల వేడుకలకు ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేస్తే ఆదాయం వస్తుందని దీన్ని ఆనందంగా అనుభవిస్తే ఆరోగ్యం చక్కగా ఉంటుందన్నారు.
పండుగ సమయాల్లో పరస్పరం కలిసిమెలిసి మాట్లాడుకోవడం ద్వారా ఆప్యాయత, అనురాగాలు పెంపొందుతాయన్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాన్ని ఆనంద రాష్ట్రంగా నిలుపుకుందామన్నారు. మన సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు వెలుగులోకి తీసుకువచ్చే విధంగా నిర్ణయాలు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ప్రాచీన కూచిపూడి నృత్యానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నామన్నారు. జన్మభూమిని, తల్లిదండ్రులను, పెద్దలను మరచిపోరాదని, పాత జ్ఞాపకాలను నెమరు వేసుకోవాలన్నారు. రాష్ట్రం బాగుంటే, దేశం బాగుంటుందని, నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన ముహూర్తం వలన చేపట్టిన ప్రతి కార్యక్రమం త్వరితగతిన పూర్తికావడం శుభసూచకమన్నారు. 9 నెలల్లో సచివాలయ నిర్మాణం, సంవత్సర కాలంలో నదుల అనుసంధాన ప్రక్రియ, వీటికి తార్కాణం అన్నారు. పులివెందులకు గండికోట లిఫ్టు ఇరిగేషన్ ద్వారా సాగునీరు ఇవ్వడంతో ఆ ప్రాంతం సస్యశ్యామలంతో పాటు బలమైన ఆర్థిక శక్తిగా మారుతుందన్నారు. జన్మభూమి మాఊరు కార్యక్రమంలో గతం కంటే ప్రజల నుండి అర్జీలు తగ్గాయని సమర్థవంతమైన పాలనకు నిదర్శనమన్నారు.
ఈ సందర్భంగా కుమారి మానస ప్రదర్శించిన ‘సింహనంది’ కూచిపూడి నృత్యరూపకం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. అదేవిధంగా కూచిపూడి నాట్యాచార్యుడు పసుమర్తి రత్తయ్యశర్మకు ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు .్భషా సాంస్కృతిక శాఖ సంచాలకులు దీర్ఘాసి విజయభాస్కర్ రచించిన జానపదాలు అనే పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. జిల్లా నుండి గుర్తించిన ఇద్దరు రైతులకు అవార్డులు అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రితోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

గ్రామీణ ఆటలు ఆడిన సిఎం
సంక్రాంతి సందర్భంగా గ్రామాల్లో జరిగే సాంప్రదాయమైన కర్రబిళ్ల, బొంగరాల ఆట, గోలీలాటలో పాల్గొన్న చంద్రబాబు చివరగా ఎంతో ఉత్సాహంగా అందరితో కలిసి గాలిపటాలు ఎగురవేసి అందరినీ ఉత్సాహపరిచారు.

చిత్రాలు..
కర్రాబిళ్ల ఆడుతున్న ముఖ్యమంత్రి
*గోళీల ఆట ఆడుతున్న చంద్రబాబు
*బొంగరాల ఆట ఆడుతున్న సిఎం