ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 13: కుటుంబం సంతోషంగా వుండాలంటే, అందులోని సభ్యులు ఆరోగ్యంగా వుండాలి, ఆరోగ్యంగా వుండాలంటే పోషక విలువలున్న పదార్ధాలు తినాలి. ఇదే సూత్రాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ వికాసం-సమాజ వికాసం పేరుతో నాలుగో విడత జన్మభూమిని ఇటీవలే నిర్వహించారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ‘మెప్మా’ కూడా ఇదే లక్ష్యంతో ఈ సంవత్సరం అందరికీ ఆరోగ్యం, అందరికీ పౌష్టికాహారం నినాదాన్ని తీసుకుని పనిచేస్తోంది. ముఖ్యమంత్రి సూచన మేరకు సంక్రాంతి సంబరాల్లో పోషక విలువలున్న పిండి వంటకాలను ‘మెప్మా’ ఆధ్వర్యంలో ప్రదర్శనకు ఉంచారు.
ఈ ప్రదర్శనలో భాగంగా మహిళా ఆరోగ్య సమితి సభ్యులు స్వంతంగా తయారుచేసిన పిండి వంటలు నువ్వుల లడ్డూలు, రాగి లడ్డూలు, చిరుధాన్యాల లడ్డూలు, రాగి మాల్ట్, జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు, మినప సున్నుండలు, గోధుమ లడ్డూలు, బొబ్బట్లు, కొబ్బరి లడ్డూలు, వేరుశనగ లడ్డూలు, అటుకులు, వేలాలు, రవ్వ లడ్డూలు, మురుకులు, అరిసెలు.. ఇలా సంక్రాంతి పండుగ సందర్భంలో చేసుకునే వంటలను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకు రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మంత్రులు హాజరై పండి పదార్ధాలను రుచి చూశారు. రుచికరమైన, పోషకాలు సమృద్ధిగా కలిగిన ఈ పిండి వంటలను అందరూ కొనేలా ప్రోత్సహించాలని ఈ సందర్భంగా మంత్రులు సూచించారు. ఇవాల్టి రోజుల్లో పిండి వంటకాల స్థానంలో జంక్ ఫుడ్ వచ్చి చేరిందని, ఇది ఏ మాత్రం సముచితం కాదని తిరుపతిలో ప్రదర్శనకు హాజరైన మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. ము ఖ్యంగా పట్టణీకరణ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో మన సంప్రదాయ అలవాట్లు కూడా వేగంగా మారుతున్నాయని, అభివృద్ధి అంటే సంప్రదాయాలను మర్చిపోవడం కాకూడదని మంత్రి పేర్కొన్నారు. సంప్రదాయంగా మనం చేసుకునే పిండి వంటల్లో అనేక పోషక విలువలున్నాయని, అందుకే మన పూర్వీకులు సంవత్సరానికి ఒక్కసారైనా బలమైన ఆహారం తినాలన్న ఉద్దేశంతో పండుగలకు పిండివంటలు చేసుకునే సాంప్రదాయాన్ని తీసుకొచ్చారని ఈ సందర్భంగా పురపాలక మంత్రి అన్నారు. సంక్రాంతి సంబరాల్లో ఏర్పాటుచేసిన పిండి వంటల ప్రదర్శనలోని పదార్ధాలను రుచి చూసిన మంత్రి చాలా రుచిగా వున్నాయని మెప్మా మహిళలను ప్రశంసించారు.
పౌష్టికాహారం విలువను ప్రజలకు తెలియజేయడం, చిన్న పిల్లలకు సరైన ఆహారాన్ని అందించడం, మెప్మా పండివంటలకు బ్రాండింగ్ కల్పించడం, తద్వారా మెప్మా మహిళలకు జీవనోపాధిని మెరుగుపరచడం వంటి లక్ష్యాలతో మెప్మా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసిందని మెప్మా ఎండి చినతాతయ్య అన్నారు. క్యాటరింగ్, పోషక విలువలతో సంప్రదాయ వంటకాల తయారీలో ఇప్పటివరకు మెప్మా ఆధ్వర్యంలో 1800 మందికి శిక్షణ ఇప్పించామని, వీరందరూ జనసమ్మర్థత వున్న ప్రాంతాల్లో తమ ఉత్పత్తుల అమ్మకం ప్రారంభించారని, అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఈ స్టాల్స్ ఏర్పాటు చేశామని చినతాతయ్య తెలిపారు. ఇదే అంశంలో పురపాలక మంత్రి నారాయణ దీనికి యాక్షన్ ప్లాన్ రూపొందించారని చినతాతయ్య చెప్పారు. దీని ప్రకారం ఇది కాక, ప్రతి పట్టణంలో 10 స్టాల్స్ చొప్పున రాష్ట్రంలో దాదాపు 1000 నూట్రి షాపులను మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నామని, ముఖ్యంగా చిన్నపిల్లల పాఠశాలలుండే చోట వీటిని ఏర్పాటు చేయడం ద్వారా జంక్ ఫుడ్ ధోరణిని అరికట్టవచ్చనేది తమ ప్రయత్నమని ఆయన వెల్లడించారు.
అంతేకాక, 40వేల మంది కమ్యూనిటీ డాక్టర్లను కూడా తయారు చేస్తున్నామని, తద్వారా షుగర్, బిపి చెక్ చేయడంతో పాటు, చిన్న చిన్న జ్వరం, జలుబు వంటి రోగాలకు మందులివ్వడంతో పాటు, ఫస్ట్ ఎయిడ్ చేయడంలో కూడా వీరికి తర్ఫీదు నిస్తున్నామని చెప్పారు. పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్యంగా వుండడం అనే లక్ష్యంతో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఈ కార్యాచరణను అమల్లోకి తెచ్చిందని చినతాతయ్య వెల్లడించారు.