ఆంధ్రప్రదేశ్‌

అట్టహాసంగా పడవల పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగాయలంక, జనవరి 13: స్థానిక శ్రీరామపాదక్షేత్రం వద్ద గల పుష్కర ఘాట్ సంక్రాంతి సంబరాలకు వేదికగా నిలిచింది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో దివిసీమ సంప్రదాయ రాష్ట్ర స్థాయి పడవల పోటీతో పాటు వివిధ పోటీలు శుక్రవారం నిర్వహించారు. శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో స్వచ్ఛ నాగాయలంక, గ్రామాభివృద్ధి కమిటీ, గ్రామ పంచాయతీ సంయుక్త సహకారంతో ఈ వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరిగాయి. ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆయన సతీమణి విజయలక్ష్మి ఆధ్వర్యంలో భోగి మంటలు ప్రారంభమయ్యాయి. అనంతరం మహిళల ముగ్గుల పోటీలు, లెమన్ అండ్ స్పూన్, టగ్గ్ఫావార్, పురుషులకు బాటురాయి ఎత్తుట వంటి పోటీలను నిర్వహించారు. తదుపరి రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎల్‌వి సుబ్రహ్మణ్యం కృష్ణవేణి విగ్రహానికి పూలమాలలు వేశారు. మండలి దంపతులు కృష్ణవేణి విగ్రహం వద్ద పడవల పోటీ ప్రారంభానికి సూచికగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. 21 బృందాలు కోలలతో, పడవ నెట్టుడు పోటీలో 45 మంది (మూడు బృందాలు)గా, ఇంజన్ పడవ పోటీలో 44 మంది 11 బృందాలుగా (నాలుగు రౌండ్స్) జరిగాయి. ఈ పోటీలను రాష్ట్ర బిసి సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు, జిల్లా కలెక్టర్ బాబు.ఎ ప్రారంభించారు. ఈ పోటీలను చూసేందుకు పరిసర ప్రాంతాలకు చెందిన వేలాదిమంది ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావటం విశేషం. సంక్రాంతి సంబరాల్లో భాగంగా చిన్నారులు గొబ్బెళ్ల చుట్టూ తిరిగి కోలాటంతో పాటలు పాడారు.

చిత్రం..పందెంలో పోటీ పడుతున్న పడవలు