ఆంధ్రప్రదేశ్‌

కన్నుల పండువగా పార్వేటి ఉత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 15: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి ఆదివారం తిరుమలలో పార్వేటి ఉత్సవం కన్నుల పండువగా సాగింది. మకర సంక్రమణ మరుసటి రోజైన కనుమ రోజున తిరుమల పార్వేటి మండపం వద్ద ఈ ఉత్సవం నిర్వహించడం టిటిడికి ఆనవాయితీ. పార్వేటి ఉత్సవం అంటే స్వామివారు వేటకు వెళ్లే దృశ్యం. ఈ ఉత్సవం సందర్భంగా ఒక జింకను తీసుకువచ్చి తుపాకీతో మూడుసార్లు గాలిలోకి కాల్పులు జరిపి నమూనా వేటను నిర్వహించేవారు. తుపాకీ పేలుడు శబ్దంతో జంతువులను భయపెట్టడం సరికాదని జంతు ప్రేమికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో ఈ పార్వేటి ఉత్సవం రోజున గడ్డిబొమ్మతో తయారుచేసిన జింకను ఉంచి, అర్చకులు ఈటెను విసిరి ఈత్సవాన్ని నిర్వహించే విధానాన్ని టిటిడి పాటిస్తోంది బోయలు స్వామివారిని తమ భుజస్కందాలపై ఉంచుకుని అర్చకులు ఈటెను పట్టుకుని ముందుకు పరుగులు తీస్తుంటే బోయలు స్వామివారిని మోస్తూ వారివెంట పరుగులు తీస్తారు. ఆలా ముందుకు, వెనక్కు మూడుసార్లు ఈ క్రీడ సాగింది. ఈ పార్వేటి ఉత్సవాన్ని పురస్కరించుకుని గోదాపరిణయోత్సవం కూడా కన్నుల పండువగా నిర్వహించారు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని ఆండాల్ అమ్మవారి ఆలయం నుంచి ప్రత్యేకంగా కానుకలను, గోదాదేవి మాలలను తిరుమలకు తీసుకువచ్చారు. ఈ మాలలను మూలవిరాట్టుకు అందంగా అలంకరించారు. ఆదివారం సాయంత్రం ప్రాతఃకాలారాధన పూర్తయిన తరువాత మలయప్పస్వామివారు. కృష్ణస్వామి వేర్వేరు బంగారు పల్లకిలో పార్వేటి మండపం వరకు ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఈ మండపంలో స్వామివారి ఆరాధన, నివేదన, హారతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య వంశస్థులు పాల్గొన్నారు. కాగా శ్రీ కృష్ణస్వామిని మాత్రం సన్నిధిగొల్ల పూజలు చేసిన చోటికి వేంచేపు చేసి వెన్న, పాలు ఆరగింపులు చేసి కర్పూర హారతులిచ్చారు. అనంతరం కృష్ణస్వామిని మలయప్ప స్వామి సన్నిధికి చేర్చారు. యాదవ భక్తులు సమర్పించిన పాలు, వెన్నను మలయప్ప స్వామికి నివేదన చేసి హారతులు పట్టారు. గొల్లలకు బహుమతులు అందించిన అనంతరం పార్వేటి ఉత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఉత్సవం పూర్తయిన వెంటనే శ్రీ మలయప్ప స్వామివారిని ఆలయం వద్దకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా హథీరాంజి మఠం వద్ద నుంచి వచ్చిన బెత్తంను సన్నిధిలోకి తీసుకుని వేంచేపు చేశారు. దీంతో పార్వేటి ఉత్సవం ముగిసినట్లయింది. ఈ కార్యక్రమంలో టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఇఒ సాంబశివరావు, డిప్యూటి ఇఓ కోదండరామారావు, ముఖ్య భద్రతాధికారి రవీంద్రరెడ్డి, బొక్కసం ఇన్‌చార్జ్ గురురాజా స్వామి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..తిరుమలలో పార్వేటి ఉత్సవం సందర్భంగా ఈటెను విసురుతున్న అర్చకులు