ఆంధ్రప్రదేశ్‌

ప్రకృతి పరిరక్షణా భగవదారాధనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), జనవరి 15: ప్రకృతి, పర్యావరణం, భూమిని పరిరక్షించడమంటే భగవంతుని ఆరాధించడమేనని విశ్వగురు పీఠాధిపతి శ్రీ విశ్వయోగి విశ్వంజీ మహరాజ్ ఉద్బోధించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా శనివారం రాత్రి నగరంలో రెండు ప్రధాన ఆలయాల్లో జరిగిన మకరజ్యోతి దర్శనం కార్యక్రమాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని భక్తులకు సందేశమిచ్చారు. తొలుత బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరాలయ ప్రాంగణంలో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్, దేవాలయ పాలక మండలి, అయ్యప్ప భజన మండలి సంయుక్త ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన మకరజ్యోతిని నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు రాయపాటి సాంబశివరావు, తదితర ప్రముఖులతో కలిసి ప్రజ్వలనం చేశారు. అనంతరం భక్తులను ఆశీర్వదిస్తూ జ్యోతిని దర్శించడమంటే మనలో ఉన్న జ్ఞానజ్యోతిని ప్రజ్వలింప చేయడమేనని అన్నారు. విశ్వంజీని రాయపాటి సాంబశివరావు, ఆలయ అధ్యక్షులు సిహెచ్ మస్తానయ్య, బొల్లేపల్లి సత్యనారాయణ, కంచిపీఠం ప్రతినిధులు యాలకుల దండతో సత్కరించారు. అనంతరం మల్లారెడ్డి నగర్‌లో శ్రీ అయ్యప్ప ఆలయ వ్యవస్థాపకులు మెట్టు కృష్ణారెడ్డి ఆధ్వర్యాన కనులపండువగా మకరజ్యోతి దర్శనాన్ని ఏర్పాటు చేశారు. అసంఖ్యాకంగా తరలివచ్చిన భక్తులనుద్దేశించి విశ్వయోగి విశ్వంజీ సందేశమిస్తూ పవిత్రమైన జన్మను సార్థకం చేసుకోవాలంటే భగవంతుడు ప్రసాదించిన జీవితాన్ని సన్మార్గంలో నడిపించుకోవాలన్నారు. ముఖ్యంగా ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా ఎంచుకుని పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాలని పిలుపునిచ్చారు.

చిత్రం..గుంటూరులో నిర్వహించిన సంక్రాంతి ఉత్సవాల్లో విశ్వంజీ, ఎంపి రాయపాటి తదితరులు