ఆంధ్రప్రదేశ్‌

బస్సులు, రైళ్లు కిటకిట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 15: తెలుగువారికి అత్యంత ప్రీతిపాత్రమైన సంక్రాంతి పండుగ సందర్భంగా బంధుమిత్రులతో గడిపేందుకు వేర్వేరు ప్రాంతాల నుండి స్వస్థలానికి వచ్చిన వారంతా ఆదివారం మధ్యాహ్నం నుంచి తిరుగు ప్రయాణం కట్టారు. సోమవారం కార్యాలయాలు పనిచేయడంతో కనుమ అయినప్పటికీ అత్యధికులు బయలుదేరారు. వీరందరితో బస్సు, రైల్వే స్టేషన్లు సాయంత్రం నుండి కిటకిటలాడాయి. ఒక్క కృష్ణా జిల్లా నుండి సాధారణ రోజుల్లో కూడా హైదరాబాద్‌కు 190 బస్సులు రాకపోకలు సాగిస్తుండగా పండుగ సందర్భంగా రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనంగా మరో 210 ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నామని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ పివి రామారావు ‘ఆంధ్రభూమి’ ప్రతినిధికి తెలిపారు. వీటిల్లో పండిట్ నెహ్రూ బస్టేషన్ నుండి 125 సర్వీసులు ఉండగా 55 సర్వీసులకు ఆన్‌లైన్ ద్వారా రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించారు. జిల్లాలోని ఇతర ప్రాంతాల నుండి హైదరాబాద్‌కు 60 సర్వీసులు ఏర్పాటయ్యాయి. విజయవాడ నుండి చెన్నైకి 13, బెంగుళూరుకు 5, విశాఖపట్నంకు 7 ఏర్పాటయ్యాయి. ప్రభుత్వ జీవో ప్రకారం ప్రత్యేక బస్సుల్లో ఒకటిన్నర రెట్లు చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇక గుంటూరు, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల నుంచి సాధారణగానే రోజూ హైదరాబాద్‌కు మరో 100కు పైగా బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇదిలావుండగా విజయవాడ రైల్వే స్టేషన్ మీదుగా మొత్తం 70 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు కాగా, వీటిల్లో 20 రైళ్లు విజయవాడ - హైదరాబాద్ మధ్య నడుస్తున్నాయి. రైళ్లన్నీ కూడా కిటకిటలాడుతూ కనిపించాయి. ఆదివారం ఒక్క విజయవాడ నుంచే లక్ష మందికి పైగా ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు బయలుదేరి వెళ్లారు.