ఆంధ్రప్రదేశ్‌

‘కృష్ణా’లో జోరుగా జూదాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 15: అత్యున్నత న్యాయస్థాన ఆంక్షలు.. చట్టాలు ఎన్ని ఉన్నప్పటికీ ముందెన్నడూ లేనివిధంగా రాజకీయంగా చైతన్యవంతమైన కృష్ణా జిల్లాలో సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు, పేకాట జూదం జోరుగా సాగాయి. పోలీసు యంత్రాంగం నిర్లిప్తత వల్ల భయమనేది లేకుండా ఎక్కడ ఖాళీ స్థలం దొరికితే అక్కడ ప్రత్యేక ‘జూద’ శిబిరాలు వెల్లివిరిశాయి. ఎక్కడికక్కడ స్థానిక ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే ఈ శిబిరాలు కళకళలాడుతూ కనిపించా యి. ఇక్కడి కోడిపందాలు చూడటానికి, పేకాట ఆడటానికి హైదరాబాద్, విజయనగరం, వరంగల్, ఖమ్మం, ఉభయగోదావరి జిల్లాల నుంచి కూడా ‘పెద్దలు’ తరలిరావటంతో ఖరీదైన కార్లు, ఇతర వాహనాలతో పలు గ్రామాలు సందడిగా మారా యి. రాత్రిళ్లు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పందాలు జరిగా యి. ఏదిఏమైనా కోట్లాది రూ పాయలు చేతులు మారా యి. పెద్దనోట్ల రద్దుతో ఈద ఫా పందాలు పెద్దగా సాగబోవని తొలుత భావించినా అందుకు భిన్నంగా రూ. 500, 2వేల నోట్లు ఈ శిబిరాల్లో ఫెళఫెళలాడాయి. కైకలూరు నియోజకవర్గం కలిదిండి ప్రాంతంలో ఎంపీలు మాగంటి బాబు, జెసి దివాకరరెడ్డి స్వయంగా కోడి పందాల్లో పాల్గొన్నారు. దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యేలు, లేదా వారి ముఖ్య అనుచరుల నేతృత్వంలోనే పందాలు సాగాయి. కోస్తా ప్రాంతాల్లో కోడి పందాలను తిలకించేవారి నుంచి రూ.100, రూ.200లు చొప్పున టిక్కెట్టు రూపంలో వసూలు చేశారు. ఇక పేకాట కోసం కనీసం రెండు వేల రుసుముతో ఒక్కో డైనింగ్ టేబుల్ బల్ల అప్పగించారు. కొన్నిచోట్ల ముందు జాగ్రత్తతో జూదరులు తమవెంట తెచ్చుకోకుండా స్మార్ట్ఫోన్లలో ప్రత్యేక యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకుని ఎంచక్కా ఆడుకున్నారు. ఈ రెండు రోజుల్లో దాదాపు ప్రతి మండలంలో కనీసం నాలుగు గ్రామాల్లో అయినా కోడిపందాలు, పేకాట జరిగాయి. మంత్రి దేవినేని ఉమా ప్రాతినిథ్యం వహిస్తున్న విజయవాడ నగర శివారు కొత్తూరు తాడేపల్లిలో 11 ఎకరాల్లో ఆరు పెద్ద బరులు ఏర్పాటు చేసి భారీగా కోడిపందాలు నిర్వహించారు. ఈ ఒక్క ప్రాంతంలోనే తొలి రెండు రోజుల్లో ఐదారు కోట్ల రూపాయల మేర పందాలు జరిగాయని చెబుతున్నారు. వాహనాల పార్కింగ్ ఫీజు వసూలు, హోటళ్ల నిర్వహణకు నిర్వాహకులు ముందస్తుగానే టెండర్లు పిలిచారు. ఒక్కో టెండర్‌కు రూ.10 లక్షల వరకు ధర పలికిందంటున్నారు.
పెనమలూరు నియోజకవర్గం ఈడుపుగల్లు, గన్నవరం నియోజకవర్గం అం పాపురం, ఇందుపల్లి, గుడివాడ నియోజకవర్గం పుట్టగుంట, విజయవాడ తూర్పు నియోజకవర్గం పటమటలంక, నూజివీడు నియోజకవర్గం రావిచర్ల, జనార్ధనపురం, శోభనాపురం, అవనిగడ్డ నియోజకవర్గం కొడాలి, నడకుదురు, శ్రీకాకుళం, మొవ్వ, పెద్దకళ్లేపల్లి, భట్లపెనుమర్రు, బందరు నియోజకవర్గం గోపువానిపాలెం, మేకవానిపాలెం, పెడన ని యోజకవర్గంలో మునిపెడ, పల్లెపాలెం, బల్లిపర్రు, తిరువూరు నియోజకవర్గం ముష్టికుంట్ల, కాకర్ల గ్రామాల్లో పందాలు జోరుగా సాగాయి. ప్రతి గ్రామంలోనూ ఈ పందాలపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. పందాలను దృష్టిలో వుంచుకుని జూదరులు కొద్దిరోజుల ముందు నుంచే బ్యాంక్‌ల నుంచి డబ్బు డ్రా చేసుకున్నారు. కొందరైతే బంగారం, ఇతర ఆస్తులు తాకట్టుపెట్టి డబ్బు సమీకరించుకున్నారు. ఏదిఏమైనా సందట్లో సడేమియాలా పోలీసులకూ కాసుల పంట పండింది.